సత్తెనపల్లి: అక్రమ కేసులో వైఎస్సార్ సీపీ నాయకుడికి మంగళవారం పట్టణ పోలీసులు నోటీసులు అందించారు. రాజుపాలెం మండలానికి చెందిన వైఎస్సార్ సీపీ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ మహబూబ్ కమల్‌పాషా గత నెల 10న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి పిలుపు మేరకు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డి ఆధ్వర్యంలో సత్తెనపల్లిలో నిర్వహించిన దగా డీఎస్సీ ర్యాలీలో పాల్గొన్నందుకు 20 రోజుల తర్వాత పట్టణ పోలీసులు వెతికి మరీ అక్రమ కేసు నమోదు చేశారు. దీనిలో భాగంగా ఆయన పోలీసుల నుంచి నోటీస్ అందుకున్నారు. ఆయనతోపాటు వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ మౌలాలి, పార్టీ మైనార్టీసెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ జానీ, పార్టీ నాయకుడు జేఎస్‌కే జానీ ఉన్నారు.


