జిల్లా అదనపు ఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరి పోలీసు పీజీఆర్‌ఎస్‌లో 92 అర్జీలు స్వీకరణ
నరసరావుపేట రూరల్: పీజీఆర్‌ఎస్ ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని జిల్లా అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్ నిర్వహించారు. అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ సమస్యలు, మోసాలు, కాక్రమణలు, బెదిరింపులు వంటి పలు అంశాలపై 92 ఫిర్యాదులు అందాయి. మహిళలు, వృద్ధులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి చట్ట ప్రకారం న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.


