న్యూస్‌రీల్
నిద్రపోతున్న నిఘా వ్యవస్థ
పులిచింతల సమాచారం
పల్నాడు
● తెలుగుదేశం పార్టీ
ముఖ్య నేతలే నిర్వాహకులు
● పట్టణం నడిబొడ్డున
కొనసాగుతున్న క్లబ్
● అప్పులపాలవుతున్న పేకాటరాయుళ్లు
గురువారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2026
సాక్షి టాస్క్‌ఫోర్స్: మాజీ మంత్రి, సీనియర్ శాసనసభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర రాజకీయాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆరుగురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసినా రాని చెడ్డపేరు, పచ్చ కండువా వేసుకొని టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచిన రెండేళ్లలోనే వచ్చిందని ఆయన అభిమానులు వాపోతున్నారు. టీడీపీ నేతలకు తానేమీ తీసుపోను అన్నట్టు మట్టి, గ్రానైట్ అక్రమార్జనకు అలవాటు పడ్డ కన్నా... చివరకు ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తున్న జూదాన్ని సైతం ప్రోత్సహిస్తుండటాన్ని ప్రజలతో పాటు కన్నా అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. కన్నా ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ నేతలు అక్రమార్జన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. సత్తెనపల్లిలోని ఆటో నగర్‌లో ఓ దాత ఎంతో ఉదార స్వభావంతో ఎన్నో ఏళ్ల క్రితం ఆలయానికి కేటాయించిన స్థలంపై దాత కుటుంబంలోని ఒకరి కన్ను మళ్లీ పడింది. రూ.కోట్ల విలువైన ఆ స్థలం వివాదాస్పదంగా ఉండటంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సెటిల్‌మెంట్ చేసి స్థలాన్ని కొట్టేశారు. ఇప్పుడు అక్కడ టీడీపీ నాయకుడు భారీ షెడ్ వేశారు. ఆ షెడ్‌కు ఓ వైపు మహిళల నర్సింగ్ జూనియర్ కళాశాల, ఆ పక్కనే శివాలయం, ఇటువైపు కళాశాల వసతి గృహం ఉన్నాయి. అయినప్పటికీ వీటి నడుమ ఉన్న షెడ్‌లో పేకాట క్లబ్ ఏర్పాటైంది. టీడీపీ నాయకులే నిర్వహిస్తున్నారు. రోజుకు రూ.కోటి వరకు చేతులు మారుతున్నాయి. రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు టేబుళ్లు ఏర్పాటు చేశారు. కార్లు, ద్విచక్ర వాహనాలకు పార్కింగ్, పేకాటరాయుళ్లకు విందు.. ఇలా సకల సదుపాయాలు కల్పించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నలుమూలల నుంచే కాక తెలంగాణ నుంచి సైతం కార్లు వేసుకుని మరీ వచ్చి పేకాట ఆడుతున్నారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే టీడీపీ ముఖ్య నేతతోపాటు పోలీసులకు భారీ ఎత్తున మామూళ్లు అందుతున్నాయనే విమర్శలు బహిరంగంగా ఉన్నాయి. దీంతో పేకాట క్లబ్ వ్యవహారాన్ని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇక్కడ పోలీసుల భయమేమీ లేకపోవటంతో పేకాట మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్లు జోరుగా సాగుతోంది. దీనికి తోడు పేకాట ఆడే వారికి వడ్డీకి అప్పు ఇస్తూ పలువురు వ్యాపారులు దోచుకుంటున్నారు. ముఖ్య నేతకు నెలకు రూ.కోటి ఇస్తున్నారనే ప్రచారం ఉంది. స్థాయిని బట్టి టీడీపీ నాయకులకు కూడా పంపకాలు వెళుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. పోలీసు శాఖలో ఐజీ స్థాయి అధికారి నుంచి ఎస్‌ఐ వరకు నెలకు రూ.కోటి మామూళ్లు ఇస్తున్నామని, క్లబ్ వైపు ఏ ఖాకీ కూడా కన్నెత్తి చూడరని జూదగాళ్లకు నిర్వాహకులు భరోసా ఇస్తున్నారట. దీంతో పక్క రాష్ట్రాల నుంచి సైతం పెద్ద ఎత్తున పేకాట రాయుళ్లు వస్తున్నారని సమాచారం.
ఏఐ ప్రతీకాత్మక చిత్రం
జిల్లాలో స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ విభాగాలు సైతం టీడీపీ నేతల ఒత్తిళ్ల మేరకు మౌనంగా ఉండడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రంలోనే కీలకమైన పల్నాడు జిల్లాకు గత నెల రోజులకుపైగా ఎస్పీ లేకపోవటంతో ఇన్‌చార్జి ఆధ్వర్యంలో నడుస్తోంది. జిల్లాలో శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయి. గత నెల 13న జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) రోహిత్ కుమార్ చౌదరిని కలిసి వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్‌రెడ్డి దీనిపై ఫిర్యాదు చేశారు. ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. బుధవారం సత్తెనపల్లిలోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయం నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. సత్తెనపల్లి డీఎస్పీ డాక్టర్ ఎంవీ కృష్ణచైతన్యను కలిసి ఫిర్యాదు చేశారు. క్లబ్ నిర్వహిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, క్లబ్‌ను తొలగించాలని కోరారు. ప్రజలను కాపాడాలని విన్నవించారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 28.4747 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళ్తోంది.
టీడీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పేకాట క్లబ్‌తో కలకలం మొదలైంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డమైన పనులు చేస్తూ సంపాదిస్తున్న ఆ పార్టీ నాయకుల కన్ను ఇప్పుడు పేకాటపైనా పడింది. వీరి ధనదాహానికి ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతుండగా.. అనేక కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి.


