కళ్లకు గంతలు కట్టుకుని జూడాల నిరసన | - | Sakshi
Sakshi News home page

కళ్లకు గంతలు కట్టుకుని జూడాల నిరసన

Aug 20 2026 3:28 AM | Updated on Aug 20 2026 3:28 AM

కళ్లకు గంతలు కట్టుకుని జూడాల నిరసన

గుంటూరు మెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌లో జూనియర్‌ డాక్టర్లు బుధవారం వినూత్నంగా నిరసన తెలిపారు. కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకుని ప్రభుత్వం తమ బాధలు పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయం ఎదుట బైఠాయించి డిమాండ్లు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. పలువురు జూడాలు చేతులపై, ముఖాలపై ట్యాటూలు, పచ్చబొట్లు వేయించుకుని నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు వారు చేస్తున్న సమ్మె బుధవారం పదోరోజుకు చేరింది. దీంతో రోగుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. పలు వార్డుల్లో ఇన్‌పేషెంట్‌ అడ్మిషన్లు లేక ఖాళీ బెడ్స్‌ కనిపించాయి. సీనియర్‌ వైద్యులు సైతం రోగులను అడ్మిట్‌ చేసుకునేందుకు అంతగా ఆసక్తి చూపించటం లేదు. సీరియస్‌ కేసులు తప్ప రోగులను ఓపీలో చూసి అడ్మిషన్లు చేయకుండా ఇళ్లకు పంపించి వేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని జూడాలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు మెడికల్‌ కాలేజ్‌ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు యు.ఈశ్వర్‌శంకర్‌, జనరల్‌ సెక్రటరీ విఘ్నేష్‌ ఆపతి, ఇతర నేతలు ఎ.వి.కృష్ణ చౌదరి, కె.ప్రసన్న ఆదిలక్ష్మి, షేక్‌ సోహిల్‌ అలీ, జగదీష్‌ గాదె, పి.ఎస్‌.వి.కల్యాణి, జేత్ర మర్రిపాటి, అనురాగ్‌, బి.వంశీకృష్ణ, బి.స్నేహసాహిత్య, జి.రాధిక, కునపవర్‌ కార్తీక్‌, నిషిరాగ్‌ బికుంతె, పి.సందీప్‌కుమార్‌, ఎన్‌.సాయిప్రదీప్‌, ఉదయ్‌సాగర్‌, సాయిప్రదీప్‌, తరుణ్‌కుమార్‌, హేమంత్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement