పరిశ్రమల సమస్యల పరిష్కారానికి కసరత్తు | - | Sakshi
Sakshi News home page

పరిశ్రమల సమస్యల పరిష్కారానికి కసరత్తు

Aug 20 2026 3:28 AM | Updated on Aug 20 2026 3:28 AM

స్పైసెస్‌ పార్క్‌లో ఇబ్బందులు..

● జిల్లా పరిశ్రమల అధికారి ఎస్‌.వి. సురేష్‌

● ‘ఎన్‌ఎస్‌ఎల్‌’లో పరిశ్రమల గ్రీవెన్స్‌

యడ్లపాడు: పారిశ్రామికాభివృద్ధికి అడ్డంకిగా ఉన్న సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో చేపట్టిన ఒక రోజు– ఒక పరిశ్రమ –ఒక పార్క్‌/క్లస్టర్‌ బుధవారం నిర్వహించారు. మండలంలోని ఎన్‌ఎస్‌ఎల్‌ టెక్ట్స్‌టైల్స్‌ మిల్లును పల్నాడు జిల్లా అధికారుల బృందం సందర్శించింది. జిల్లా పరిశ్రమల అధికారి ఎస్‌.వి.సురేష్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ పర్యటనలో వివిధ శాఖల ప్రతినిధులు పాలుపంచుకున్నారు.

సమస్యలు సవాలక్ష..

ఈ పర్యటనలో భాగంగా పరిశ్రమ ప్రతినిధులు తమ యూనిట్‌ ఎదుర్కొంటున్న సవాళ్లను అధికారుల ముందు ఉంచారు. ప్రధానంగా విద్యుత్‌ సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులు, పునరుత్పాదక ఇంధన విధానాలు, గ్రిడ్‌ ఇంజెక్షన్‌ వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. ప్రత్యేకించి ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ, హైబ్రిడ్‌ పవర్‌ పాలసీలకు సంబంధించి స్పష్టత కోరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిశ్రమకు అందాల్సిన రాయితీలు, పారిశ్రామిక ప్రోత్సాహకాల క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయని బృందం దృష్టికి తెచ్చారు. వీటిని త్వరితగతిన పరిష్కరించాలని పరిశ్రమ యాజమాన్యం అధికారులను కోరింది.

సమన్వయ లోపాన్ని అధిగమించే దిశగా..

పరిశ్రమల వద్దకే వెళ్లి సమస్యలను తెలుసుకోవడం ద్వారా పరిష్కారాన్ని వేగవంతం చేయవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఎల్‌డీఎం కె.ఎస్‌.రామ్‌ప్రసాద్‌, ఎస్‌ఎఫ్‌ఓ ఎ.అన్వేష్‌కుమార్‌రెడ్డి, అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ జె.సుధాకర్‌, జిల్లా విద్యుత్‌శాఖ ఈఈ వై.ఏడుకొండలు, పర్యావరణ ఇంజినీర్‌ ఎండీ నజీనాబేగం, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ షేక్‌ మహబూబ్‌సుభానీ, ఫైర్‌సర్వీసెస్‌ డీడీఆర్‌ఎఫ్‌ఓ ఎస్‌.శ్రీధర్‌, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ డాక్టర్‌ ఎంఎల్‌ నరసింహారావు హాజరయ్యారు. సమస్యల పరిష్కారానికి జిల్లా పరిశ్రమల కేంద్రం నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని డీఐఓ ఎస్‌.వి. సురేష్‌ స్పష్టం చేశారు. సమావేశంలో యడ్లపాడు తహసీల్దార్‌ జెట్టి విజయశ్రీ, ఎన్‌ఎస్‌ఎల్‌ టెక్స్‌టైల్స్‌ తరఫున యూనిట్‌ హెడ్‌ వి. మురళి, జీఎంలు సురేంద్రరెడ్డి, ఎం.నరసింహారావు, ఈహెచ్‌ఎస్‌ మేనేజర్‌ వి.శ్రీనివాసులురెడ్డి, హెచ్‌ఆర్‌ఐర్‌ ఎం.నరసింహం, ఎలక్ట్రికల్‌ విభాగం ప్రతినిధి ఎం.బుజ్జిబాబు తమ అభిప్రాయాలను అధికారుల దృష్టికి తెచ్చారు. క్షేత్రస్థాయిలో ఇలాంటి సమన్వయ సమావేశాలు పరిశ్రమల నిర్వహణకు ఏ మేరకు ఊతమిస్తాయో వేచి చూడాలి.

జిల్లాలో పారిశ్రామిక కార్యకలాపాలకు మరింత ఊతమిచ్చే దిశగా జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తోందని అధికారులు తెలిపారు. స్పైసెస్‌ పార్క్‌లో జిల్లా స్థాయి అధికారులు బుధవారం పర్యటించింది. పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమై మౌలిక వసతులు, భద్రత, విద్యుత్‌, నీటి సరఫరా, రహదారి సదుపాయాలపై సమగ్రంగా చర్చించింది. స్పైసెస్‌ పార్క్‌లోని ఐటీసీ లిమిటెడ్‌ ప్రాంగణంలో జరిగిన సమావేశానికి జిల్లా పరిశ్రమల అధికారి ఎస్‌.వి. సురేష్‌ అధ్యక్షత వహించారు. పలు సమస్యలు ఆయన దృష్టికి రావడంతో చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement