దేశ నిర్మాణంలో భాగస్వాములవుదాం ..
నరసరావుపేట రూరల్: దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దేశ నిర్మాణంలో నేను (పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్) ప్రచార కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా ప్రారంభిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సోమవారం తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఆగస్ట్ 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జిల్లాలోని ప్రతి ఇళ్లు, వాణిజ్యసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలపై మూడు రోజుల పాటు జాతీయ జెండాను ఆవిష్కరించాలన్నారు. అటవీ, ఉద్యాన వన శాఖల సహకారంతో ఆగస్టు 14వ తేదీన జిల్లావ్యాప్తంగా మోగా ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. ప్రజలు మొక్కలు నాటి, జాతీయ జెండాతో దేశ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేయాలని కోరారు. ప్రభుత్వ భవనాలు, బస్‌స్టేషన్‌లు, రైల్వేస్టేషన్‌లు, ముఖ్యమైన కూడళ్లను త్రివర్ణ విద్యుత్ దీపా లతో అలంకరించాలని సూచించారు. జిల్లా లోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులు ప్రత్యేక తరగతుల్లో భాగంగా దేశ భవిష్యత్ కోసం ఏం చేయగలమో వివరిస్తూ ప్రతిజ్ఞ చేస్తారని తెలిపారు. పౌరులందరూ జాతీయ జెండా చేత పట్టుకుని 30 నుంచి 60 సెకన్లు సెల్ఫీ వీడియోను పార్టనర్స్ నేషన్ బిల్డింగ్, మై ఇండియా మైవిజన్, ఇండిపెండెన్స్‌డే–2026 హ్యాష్‌టాగ్‌లతో పోస్ట్ చేయాలని సూచించారు.


