గుంటూరు మెడికల్: గుంటూరు జిల్లాకు చెందిన ఇరువురికి కరోనా నిర్ధారణ అయింది. తుళ్లూరు మండలం ఉద్దండరాయనిపాలెంకు చెందిన 18 ఏళ్ల యువతికి, తాడేపల్లికి చెందిన 32 సంవత్సరాల మహిళకు విజయవాడ జీజీహెచ్ వైద్యులు శనివారం కరోనా ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో జిల్లాలో బాధితుల సంఖ్య 8కి చేరింది. గుంటూరు జీజీహెచ్‌లో నలుగురికి కరోనా పరీక్షలు చేయగా, ఒకరికి కూడా నిర్ధారణ కాలేదు. జీజీహెచ్‌లో కరోనా టెస్టింగ్ కిట్‌లు 330, ఎన్ 95 మాస్క్‌లు 9,650, పీపీఈ కిట్‌లు 1,865 అందుబాటులో ఉన్నట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ గిరిజవోలు దుర్గాప్రసాద్ తెలిపారు. బాపట్ల జిల్లా గుండిపాలెంకు చెందిన 32 ఏళ్ల మహిళకు విజయవాడ గర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ వచ్చినట్లు శనివారం నిర్ధారించారు.


