ఖాకీ కావరానికి
కూటమి పాలనలో ఖాకీల ఇష్టారాజ్యం నడుస్తోంది. పోలీసుల వేధింపులకు మరో నిండు ప్రాణం బలైంది. ప్రేమ వ్యవహారంలో టీపీపీ నేతలకు వత్తాసు పలుకుతూ ఓ సీఐ వేధించడంతో పల్నాడు జిల్లా, అచ్చంపేట మండలం, కొండూరు పంచాయతీ శివారు నిండుజర్లకు చెందిన కడివెళ్ల నాగరాజు (50) సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం ఉదయం ఈ వీడియో వైరల్ అయింది. మృతుని బంధువులు తమకు న్యాయం చేసేదాకా మృతదేహాన్ని తీసుకునేది లేదంటూ సత్తెనపల్లి ప్రభుత్వం వైద్యశాల వద్ద ఆందోళన చేపట్టారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు కొండమోడు – పేరేచర్ల జాతీయ రహదారిపై శనివారం ఆందోళన నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది.
– అచ్చంపేట /సత్తెనపల్లి


