రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయలు

Jul 9 2026 6:23 AM | Updated on Jul 9 2026 6:23 AM

రెంటచింతల: రెంటచింతలలోని రైల్వేస్టేషన్‌ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడికి గాయాలయ్యాయి. రెంటాల గ్రామా నికి చెందిన సిద్దవటం కృష్ణారెడ్డి ఆటోలో రెంటచింతల వస్తూ రైల్వేస్టేషన్‌ సమీపంలోని మొదటి మూల మలుపు వద్ద ఆదుపు తప్పి ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గాయపడిన కృష్ణారెడ్డిని వెంటనే 108 వాహనంలో గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కృష్ణారెడ్డిని నర్సరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మాచర్ల మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ డి. శేషిరెడ్డి ఘటన స్థలానికి చేరుకుని ప్రమాద ఘటన వివరాలను తెలుసుకున్నారు. రెంటచింతల –రెంటాల గ్రామాల మధ్య రహదారిలో ను న్న మూలమలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు, స్పీడ్‌ బ్రెకర్లు ఏర్పా టు చేయడం వలన ప్రమాదాలను నివారించవచ్చన్నారు. మూలమలుపుల వద్ద అతివేగంగా నడపడం మంచిదికాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement