ప్రత్యేక ముఠాలు ఏర్పాటు
సైబర్ నేరగాళ్లు నగదు జమ చేయించుకోవడం కోసం అవసరమయ్యే బ్యాంక్ ఖాతాలను సేకరించడానికి ప్రత్యేక ముఠాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. వీరు తమకు తెలిసిన పేదలు, యువతను లక్ష్యంగా చేసుకుని ఈ ఉచ్చులోకి లాగుతున్నారు. బ్యాంక్‌లో జమ అయ్యే నగదులో 10 శాతం వరకు కమీషన్ ఇస్తామని ఆశ చూపి వారి నుంచి బ్యాంక్ పాస్‌బుక్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు తీసుకుంటున్నారు. ఎంత నగదు జమైంది, ఎక్కడికి ఈ నగదు బదిలీ చేస్తున్నారో సైతం ఖాతాదారులకు తెలియదు. కొందరికై తే కమీషన్ సైతం ఎగ్గొట్టిన సంఘటనలున్నాయి. మరోవైపు సైబర్ నేరగాళ్లు ఒక్కో ఖాతాకు రూ.10 వేల వంతున ఖాతాలు సేకరించే ముఠాకు అందజేస్తున్నారు. నేపాల్‌కి చెందిన వ్యక్తులకు దళారులు ఈ ఖాతాల వివరాలను ఇస్తున్నట్టు సమాచారం. సత్తెనపల్లికి చెందిన ఓ దళారి, ఇద్దరు నేపాలీ సైబర్ నేరగాళ్లపై ఇటీవల తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేసులు నమోదు చేసి విచారిస్తున్నట్టు తెలిసింది.


