జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు వడ్డేశ్వరం బాలిక ఎంపిక
తాడేపల్లి రూరల్ ః జాతీయస్థాయిలో జరగనున్న వాలీబాల్ పోటీలకు తాడేపల్లి రూరల్ వడ్డేశ్వరం జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన బాలిక ఎంపికయ్యింది. ఈ సందర్భంగా శుక్రవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాకుమాను జోజప్ప మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో గత డిసెంబర్‌నెలలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్ 14 వాలీబాల్ పోటీలలో గుంటూరు జిల్లా బాలికల జట్టు ప్రథమ స్ధానం సాధించిందని, ఈ జట్టులో తమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని సిహెచ్. నవీన జాతీయ జట్టుకు ఎంపికయ్యిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ టీమ్ కెప్టెన్‌గా నవీన ఎంపిక కావడం అభినందనీయమని పేర్కొన్నారు.


