ప్రభుత్వ నర్సుల సంఘం కేలండర్ ఆవిష్కరించిన కలెక్టర్
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నర్సుల సంఘం జిల్లా క్యాలెండర్‌ను శుక్రవారం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వెల్లంపల్లి పద్మ, జిల్లా కోశాధికారి పారాబత్తిన హేమలత, ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఎం.ఆషాలత, పుల్లగూర సునీత, జి.అరుణ, ఎ.భూలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
తాడేపల్లిరూరల్ : గంజాయి అమ్ముతూ పట్టుబడిన మహిళకు న్యాయస్థనం మూడు సంవత్సరాలు జైలుశిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించింది. శుక్రవారం తాడేపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నులకపేటకు చెందిన చావల జ్యోతి గత ఏడాది మే 26వ తేదీన గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం అందగా అప్పటి ఎస్‌ఐ ప్రతాప్ తన సిబ్బందితో మహిళను అదుపులోకి తీసుకుని మూడు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. చార్జిషీటు దాఖలు చేసి శుక్రవారం కోర్టులో హాజరు పరిచారు. గుంటూరు న్యాయస్థానం పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం మహిళకు వెయ్యి రూపాయలు జరిమానా, మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు తెలిపారు.


