విశేష అలంకరణలో కల్యాణ వేంకటేశ్వరస్వామి
సత్తెనపల్లి: ధనుర్మాసాన్ని పురస్కరించుకొని పట్టణంలోని పలు ఆలయాల్లో సోమవారం భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సత్తెనపల్లి పట్టణం వడ్డవల్లిలోని శ్రీ రామాలయం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామికి విశేష అలంకారం చేశారు. కోదండ రామచంద్ర ప్రభువైన శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయస్వామిలను విశేష అలంకరణ చేసి పూజలు, గోత్రనామాలతో అభిషేకాలు చేశారు. మహిళలు పాశురాలను పఠించారు. పట్టణంలోని రైల్వేస్టేషన్‌రోడ్‌లో ఉన్న శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారికి గంధంతో అలంకారం చేపట్టి ప్రత్యేక పూజలు నిర్వ హించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ప్రధాన అర్చకులు చిత్రకవి శ్యాము ఆచార్యులు గోత్రనామాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కోలాట ప్రదర్శన చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ఆయా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు
పర్యవేక్షించారు.
వైభవంగా శ్రీరామయోగయ్య స్వామి తిరునాళ్ల వేడుకలు
నూజెండ్ల: నూజెండ్ల గ్రామంలో వేంచేసి యున్న శ్రీరామయోగయ్య స్వామి తిరునాళ్ల వేడుకలు సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారిని వేకువజాము నుంచి పంచామృతాలతో ప్రత్యేకంగా అభిషేకించి విశేష పూజలు చేశారు. గ్రామంలోని నలుదిక్కులు ఏర్పాటు చేసిన పాదులకు మేళతాళాల నడుమ వైభవంగా 108 బిందెలతో గ్రామస్తులు జలాభిషేకం చేశారు. మహిళలు పొంగళ్లు పొంగించి తమ మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని వీధుల్లో మేళతాళాలతో ఘనంగా ఊరేగించారు. మూడు విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేశారు.
కోర్టు ఆవరణలో సోషల్ సెక్యూరిటీ ఆడిట్
నరసరావుపేట టౌన్: నరసరావుపేట కోర్టు ఆవరణలో పల్నాడు జిల్లా ఏఆర్ ఏఎస్పీ సత్తిరాజు ఆధ్వర్యంలో సోమవారం సోషల్ సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కోర్టు ఆవరణలో భద్రతాపరమైన అంశాలను పరిశీలించి న్యాయస్థానం ఏవోకు పలు సూచనలు చేశారు . ప్రహరీ గోడపైన ఇనుప కంచె నిర్మించాలని సూచించారు. కోర్టు ఆవరణలోకి వచ్చే కక్షిదారులను తనిఖీ చేయడానికి తగు ఏర్పాట్లు చేయాలన్నారు. కోర్టు విధులు నిర్వహించే సమయంలో సాయుధ భద్రతనుఆవరణలో ఏర్పాటు చేయాలన్నారు. అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచాలన్నారు. జనరేటర్ పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టు ఆవరణలో రాత్రి సమయంలో విద్యుత్ కాంతి ఉండేలా లైట్లు ఏర్పాటు చేయవలసిందిగా సూచించారు.
సత్తెనపల్లిలో 100 అడుగుల జాతీయజెండా ఆవిష్కరణ
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి తాలూకా సెంటర్‌లో రూ.18.40 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన 100 అడుగుల జాతీయ జెండాను రాష్ట్ర విద్యుత్ శాఖ, పల్నాడు జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ చల్లం చర్ల లక్ష్మీతులసీ, కమిషనర్ నంబూరి ఆనంద్‌కుమార్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
విశేష అలంకరణలో కల్యాణ వేంకటేశ్వరస్వామి
విశేష అలంకరణలో కల్యాణ వేంకటేశ్వరస్వామి
విశేష అలంకరణలో కల్యాణ వేంకటేశ్వరస్వామి


