బ్రాహ్మణులు ఐక్యంగా ఉండాలి..
గురజాల: బ్రాహ్మణులు ఐక్యంగా ఉండాలని ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గాలి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో బ్రాహ్మణ పురోహిత అర్చక సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రా–తెలంగాణ రాష్ట్రాల క్రికెట్ పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఆయన మాట్లాడుతూ నిత్యం దూపదీపాలు, పలు కార్యక్రమాల్లో బిజీగా గడిపే పురోహితులు ఈ విధంగా ఒకే వేదికపై క్రికెట్ ఆడటం ఎంతో మంచి పరిణామమన్నారు. ఆటల వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఈ మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన బ్రాహ్మణ, అర్చక పురోహిత సంఘాన్ని ఆయన అభినందించారు. ముందుగా శ్రీ పాతపాటే శ్వరి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీగా క్రీడామైదానానికి చేరుకున్నారు. వందేమాతర గేయాన్ని ఆలపించి పోటీలను ప్రారంభించారు. మహావీర్ కింగ్స్ రెండు మ్యాచ్‌లు, వీరభద్ర లెవన్స్ రెండు మ్యాచ్‌లు, కార్తికేయ టీము ఒక మ్యాచ్ గెలిచినట్లు కమిటీ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో అర్చక విభాగం రాష్ట్ర అధ్యక్షులు దేవులపల్లి చంద్రశేఖర్‌శర్మ, రాష్ట్ర పూర్వపు కోశాధికారి మంతిరాజు సత్యనారాయణ, నగర పంచాయతీ కమిషనర్ వైవీఎల్ శివన్నారాయణ, న్యాయవాదులు కేవీ నాగార్జున, ఆచంట శ్రీనివాసరావు, దివాకరుని రాధాకృష్ణమూర్తి, బ్రాహ్మణ సేవా సంఘం సహాయ కార్యదర్శి ఆచంట కృష్ణకుమార్, తంగెడ లక్ష్మీ నారాయణ ప్రసాద్, కోశాధికారి నారాయణభట్ల సుబ్రమణ్యం, అర్చకులు సీహెచ్ సంజీవకుమార్, కె చంద్రశేఖరశర్మ, ఈవి బాలుశర్మ, లక్ష్మణకుమార్ శర్మ, సుధాకర్ షిష్టి, కె మల్లికార్జునశాస్త్రి తదితరులున్నారు.
రెండు రాష్ట్రాల క్రికెట్ పోటీలు ప్రారంభం


