కార్తికేయుడి హుండీ ఆదాయం రూ.1.07 కోట్లు
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి హుండీల్లో భక్తులు సమ ర్పించిన కానుకల ద్వారా రూ.1,07,20,970 ఆదాయం వచ్చిందని ఈఓ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. ఆలయ ప్రాంగ ణంలో దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎన్.వి.సాంబశివరావు, మచిలీపట్నం డివిజన్ తనిఖీ అధికారి కె.శ్రీనివాసరావు పర్యవేక్షణలో బుధవారం ఉదయం హుండీ కానుకలు లెక్కించగా 84 రోజులకు రూ.1,07,20,970 ఆదాయం వచ్చింది. 1.830 కిలోల వెండి, 44.81 గ్రాములు బంగారం, 98 ఆమెరికా డాలర్లు, సౌదీ అరే బియా, కెనడా, సింగపూర్, బూటాన్, మంగో లియా, నేపాల్ దేశాల కరెన్సీ లభించింది. ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు, సేవా సమితి సభ్యులు గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.


