ఉపాధి పనులే ఆధారం
మాలాంటి పేదలకు ఉపాధి హామీ పనులే ఆధారంగా నిలుస్తున్నాయి. కూలి డబ్బులు సకాలంలో అందకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. బయట అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేక తినడానికి కూడా కష్టంగా ఉంది.
– టి.కోటిమహాలక్ష్మీ,
ఉపాధి హమీ కూలీ, రాజుపాలెం
ఉపాధి హామీ పనులకు సంబంధించి కొంత కాలంగా వేతనాలు నిలిచిపోయాయి. పనులు చేస్తున్నా కూలి డబ్బులు పడకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. కుటుంబాన్ని ఎలా నెట్టుకు రావాలో తెలియక కష్టాలు పడుతున్నాం. తక్షణమే వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి.
–ఆర్.రమేష్‌నాయక్,
ఉపాధి హమీ కూలీ, కొత్తబోధనం
ఉపాధి పనులే ఆధారం


