మళ్లీ రుబాబు
గురువారం శ్రీ 8 శ్రీ జనవరి శ్రీ 2026 మళ్లీ రుబాబు సత్తెనపల్లి: ఉపాధ్యాయులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగిస్తున్నారంటూ రచ్చ చేసిన అప్పటి ప్రతిపక్షం, గద్దెనెక్కిన తరువాత వారికి అడ్డగోలు పనులు చెబుతోంది. దీనిపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ఇప్పటికే పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న వంద రోజుల యాక్షన్ ప్లాన్ పర్యవేక్షణకు ఒక్కో పాఠశాలకు నోడల్ ఆఫీసర్ చొప్పున ఇతర శాఖల అధికారులను నియమించారు. ఇలా వారి కర్ర పెత్తనం ఏంటంటూ రగిలిపోతున్న ఉపాధ్యాయులపై చంద్రబాబు సర్కారు ముస్తాబు పేరుతో మరో పని భారం మోపింది. విద్యార్థులను ‘ముస్తాబు’ చేయలేక ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జీవో విడుదల... ప్రభుత్వ పాఠశాలలో డైలీ హైజీన్ అండ్ డిసిప్లిన్ పేరుతో ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని గత నెల 19 నుంచి ప్రారంభించారు. ఇందుకోసం ప్రభుత్వం జీవో నెంబర్ 43 విడుదల చేసింది. తప్పనిసరిగా ప్రతి తరగతి గదిలో ముస్తాబు కార్నర్ ఏర్పాటు చేయాలి. అందులో అద్దం, దువ్వెన, సబ్బు, హ్యాండ్ వాష్ లిక్విడ్, నెయిల్ కట్టర్, కొబ్బరినూనె తదితరాలు ఉండాలి. విద్యార్థులు పరిశుభ్రంగా, క్రమశిక్షణగా ఉండేలా చూడాలన్నది ఆ జీవో సారాంశం. అంతే కాకుండా చేతులు శుభ్రం చేసుకునేలా దశల చార్టులు, గోర్లు, జుట్టు, వ్యక్తిగత పరిశుభ్రత చార్టు, టాయిలెట్ వినియోగం, సురక్షిత నీటిపై విద్యార్థులకు అనుకూలమైన ఐఈసీ మెటీరియల్‌ను కూడా ప్రదర్శించాలి. ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేసి వారికి తర్ఫీదు ఇవ్వాలి. వారం వారం ముస్తాబు స్టార్ ఆఫ్ ది వీక్‌లను ఎంపిక చేయడం, రివార్డులివ్వడం చేయాలి. పాఠశాలకు అపరిశుభ్రంగా వచ్చేవారిని, తలదువ్వకుండా వచ్చే వారిని గుర్తించాలి. వారితో బడిలోనే తలదువ్వడం లేదా దువ్వించడం చేయించాలి. ఈ కార్యక్రమం పై ఉపాధ్యాయ వర్గాలు మండిపడుతున్నాయి. బడికి వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించాలా! లేక ముస్తాబు చేయాలా! చేయిస్తూ కూర్చోవాలా? అంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.
దువ్విన తలనే దువ్వుతూ...
వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు శుభ్రత పరచుకోవడం వంటివి అవసరమే. విద్యాలయాల్లో విద్యార్థులకు అందుబాటులో దువ్వెన, అద్దం, సబ్బు వంటివి ఉంచడం వల్ల వారు చదువు కన్నా వ్యక్తిగత సౌందర్యంపైనే శ్రద్ధ చూపే అవకాశాలు లేకపోలేదు. ప్రాథమిక పాఠశాలల స్థాయిల్లో ఎలా ఉన్నా ఆ ప్రభావం హైస్కూల్స్‌పై పడే ప్రమాదం లేకపోలేదు. దీంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇవేం ఉత్తర్వులంటూ వాపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
న్యూస్‌రీల్
ఉపాధ్యాయుల్లో తీవ్ర అసహనం
పులిచింతల సమాచారం
జిల్లాలో 1,215 ప్రాథమిక, 54 ప్రాథమికోన్నత, 298 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 1,44,362 మంది చదువుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలు వీటికి అదనంగా ఉన్నాయి. ముస్తాబు కార్యక్రమం ప్రారంభం కావడంతో జిల్లాలో పలు పాఠశాలల్లో తూతూ మంత్రంగా కార్నర్లు ఏర్పాటు చేశారు. ఎన్నికలకు ముందు కన్నీళ్లు తుడిచేందుకు కల్లిబొల్లి మాటలు చెప్పి కాలం నెట్టుకొచ్చిన చంద్రబాబు అండ్ కో... ఇప్పుడు బోధనేతర బాధ్యతలు అప్పగించడంపై ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పల్నాడు
గురువారం శ్రీ 8 శ్రీ జనవరి శ్రీ 2026
‘ముస్తాబు’...
విద్యార్థులకు అందుబాటులో అద్దం,
దువ్వెన,, పౌడర్ ఉంచాలని ఆదేశాలు
బోధనేతర పనులపై ఉపాధ్యాయ
సంఘాల మండిపాటు
పరిశుభ్రత సంగతి సరే...
పాఠాలు చెప్పేదెప్పుడని ఆగ్రహం
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 3900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 39.8368 టీఎంసీలు.
1/4
మళ్లీ రుబాబు
2/4
మళ్లీ రుబాబు
3/4
మళ్లీ రుబాబు
4/4
మళ్లీ రుబాబు