ఉపాధికి సమాధి
సత్తెనపల్లి: నిరుపేదలకు జీవనోపాధి కల్పించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో వికసిత్ భారత్–రోజ్‌గార్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) చట్టం (వీబీ–జీ రామ్‌జీ) అమలులోకి తెచ్చారు. ఈ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం క్రమంగా సమాధి చేస్తోంది. చేసిన పనులకు కూలి డబ్బులు చెల్లించకుండా వేధిస్తోంది. మరోవైపు టీడీపీ మద్దతు దారులను ఫీల్డ్ అసిస్టెంట్లుగా నియమించి వారికి ఉపాధి నిధులను దోచి పెడుతోంది. ఏటా ఉపాధి హామీ పథకం కింద 100 రోజుల పని కల్పించి సొంతూరు లోనే ఉపాధి పొందేలా చర్యలు తీసుకో వాలి. చంద్ర బాబు ప్రభుత్వం గత ఐదు నెలలుగా కూలీలకు వేతనాలు ఇవ్వడం లేదు. దీంతో పట్టణాల్లో కాంక్రీట్ పనులు, భవన నిర్మాణ పనులు వెతుక్కుంటూ వలస బాటపడుతున్నారు.
జిల్లాలో రూ. 11.51 కోట్లు వేతన బకాయిలు ...
ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు వేతనాలు ఐదు నెలల నుంచి అందకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. 2025 జూలై 21 నుంచి ఉపాధి హామీ కూలీలకు చెల్లించాల్సిన వేతనాలు నిలిచిపోయాయి. జిల్లాలో రూ.11.51 కోట్లు బకాయిలు నిలిచిపోయాయి.
కూలీల డబ్బు .. ఫీల్డ్ అసిస్టెంట్ల జేబుల్లోకి...
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన టీడీపీ నేతలంతా అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎంతో కాలంగా ఉన్న ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి తమకు అనుకూలమైన వ్యక్తులను నియమించుకున్నారు. ఈ క్రమంలో పలువురు ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రతివారం మాస్టర్ల నమోదులో ఇష్టానుసారంగా నమోదు చేయిస్తూ సొమ్ము స్వాహా చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
ఉపాధి కూలీల వేతన వెతలు
జిల్లాలో వేతన బకాయిలు
రూ.11.51 కోట్లు
ఐదు నెలలుగా అందని కూలి డబ్బులు
పట్టించుకోని పాలకులు, అధికారులు
వలసబాటలో ఉపాధి హామీ కూలీలు


