గురజాల కౌన్సిల్‌లో ఉద్రిక్తత
పోలీసుల ఓవరాక్షన్‌తో ఇబ్బందులకు గురి కవ్వింపులతో కూటమి నేతలు ఓటింగ్‌లో పాల్గొనకుండా ఆంక్షలు నగర పంచాయతీ గేట్ వద్ద నిరసన తెలిపిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు
గురజాల: గురజాల నగర పంచాయతీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఉద్రిక్తతల నడుమ ముగిసింది. జంగమహేశ్వరపురం గ్రామాన్ని గురజాల నగర పంచాయతీ నుంచి వేరు చేసేందుకు సోమవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశం గందరగోళంగా మారింది. కూటమి నేతల దౌర్జన్యం..పోలీసుల బెదిరింపులు అణచివేతల మధ్య సమావేశం ముగిసింది. వైఎస్సార్ సీపీ సభ్యులను ఓటింగ్‌లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నాలు చేశారు. నాయకులను ఎక్కడిక్కడ కట్టడి చేశారు. కార్యాలయం సమీపంలోకి ఎవరిని అడుగు పెట్టనీయకుండా పోలీసులు తమ బలగాలతో అడ్డుకున్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి యెనుముల మురళీధర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ మెంబర్ కొమ్మినేని వెంకటేశ్వర్లు (కేవీ)లు మునిసిపల్ అధికారులు, పోలీసుల నిరంకుశ వైఖరికి నిరసనగా కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. తమ పార్టీ కౌన్సిలర్లు ఓటింగ్‌లో పాల్గొనకుండా అడ్డుకోవడంపై యెనుముల, కేవీలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని తగిన రీతిలో బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు. సోమవారం ఉదయం నుంచి పట్టణంలో పోలీసులు అడుగడునా ఆటంకాలు కలిగిస్తూ కౌన్సిల్‌కు హాజరయ్యే సభ్యులను ఎలాగైనా లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. కానీ ఎట్టకేలకు పోలు పవన్మయి మినహా మిగిలిన సభ్యులు కౌన్సిల్ హాల్‌లోకి ప్రవేశించి ఓటింగ్‌లో పాల్గొన్నారు. అధికారులు అండదండలతో కౌన్సిల్‌లో తీర్మానం ప్రవేశపెట్టి జంగమహేశ్వరపురంను విడగొట్టే విధంగా పలువురు టీడీపీ కౌన్సిలర్లు వైఎస్సార్ సీపీ గుర్తుతో గెలిచి టీడీపీ మద్దతు ఇస్తున్న కౌన్సిలర్లు ఓటింగ్‌కు సహకరించి తీర్మానం ఆమోదించేలా చేసుకున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో పోలీసుల వ్యవహరం, అధికారుల వైఖరి సర్వత్రా విమర్శలకు దారితీసింది.
కవ్వింపులతో టీడీపీ నేతలు
నగర పంచాయతీ నుంచి జంగమహేశ్వరపురం గ్రామాన్ని విడదీసేందుకు గాను నిర్వహించిన మునిసిపల్ అత్యవసర సమావేశంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లలో మాజీ చైర్మన్ పోలు పవన్మయి సెలవులో ఉండడం వలన లోపలికి రానీయలేదు. దీంతో కౌన్సిలర్లు అందరూ నగర పంచాయతీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. బయట ఉన్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి యెనుముల మురళీధర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ మెంబర్ కొమ్మినేని వెంకటేశ్వర్లు (కేవీ)లకు సమాచారం ఇచ్చారు. వారు నగర పంచాయతీ కమిషనర్‌తో మాట్లాడుతామని అడుగ్గా పోలీసులు వైఎస్సార్ సీపీ శ్రేణులను అడ్డుకున్నారు. దీంతో మరొక వైపు టీడీపీ నాయకులు గుంపులుగా చేరి ఈలలు, కేకలతో కవ్వింపు చర్యలు చేపట్టారు. కనీసం వైఎస్సార్ సీపీ నాయకులు పోలీసులు, నగర పంచాయతీ కమిషనర్‌తో మాట్లాడుతుంటే అర్థం కాకుండా చేయాలనే ఆలోచనతో టీడీపీ నాయకులు చర్యలు చేపట్టారు.
గురజాల కౌన్సిల్‌లో ఉద్రిక్తత


