క్రీస్తు జననం లోకానికి శుభకరం
చిలకలూరిపేట: క్రీస్తు జననం లోకానికి శుభకరమని... క్రీస్తు ప్రబోధాలు సర్వమానవాళిని సన్మార్గంలో నడిపేందుకు దోహదపడతాయని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని ఎన్‌ఆర్‌టీ రోడ్డులో ఉన్న ఆమె నివాసంలో ఆదివారం సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ముందుగా క్రైస్తవ ప్రముఖులతో కలసి క్రిస్మస్ కేక్‌ను కట్ చేశారు. సెమీ క్రిస్మస్‌ను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ క్రీస్తు బోధనలు అందరూ ఆచరిస్తే ఉత్తమ సమాజం సాకారం అవుతుందన్నారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శ త్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం జీసెస్ లోకానికి ఇచ్చిన సందేశాలు అని పేర్కొన్నారు. క్రీస్తు అందించిన జీవిత సందేశం, విలువలను గుర్తు చేసుకోవడానికి ఇది ఒక గొప్ప సందర్భమని వెల్లడించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు దాసరి చిట్టిబాబు, బండారు వీరయ్య, బండారు జయకుమార్, గోపతోటి జాన్, మోషే, కందుల బుల్లెబ్బాయి, చెంచురాజు, మైలా రాజేష్, రవి, నలమాల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
సెమి క్రిస్మస్ వేడుకల్లో
మాజీ మంత్రి విడదల రజిని


