వైఎస్సార్ సీపీలో చేరిన అమరావతి టీడీపీ నేతలు
పెదకూరపాడు: చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలకు విసుగు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. పెదకూరపాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సమక్షంలో నియోజకవర్గంలోని అమరావతి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పలువురు వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు షేక్ మొహమ్మద్ రఫీ, షేక్ షమీముల్లా, షేక్ షారుఖ్, షేక్ జరీనా, షేక్ షాజాది, షేక్ మీరాబీలకు నంబూరు శంకరరావు పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ అత్యధిక సీట్లు సాధించాం అనే అహంతో చంద్రబాబు ప్రభుత్వం రాష్టంలో రాక్షస పాలన కొనసాగిస్తుందని, ప్రజలందరూ గమనిస్తున్నారని మళ్ళీ జగనన్న ప్రజా సంక్షేమ పాలన త్వరలో వస్తుందని తెలిపారు. వారి ప్రభుత్వ పాలన చూసి టీడీపీ నాయకులే అసంతృప్తితో ఉన్నారని త్వరలో వారందరూ వైఎస్సార్ సీపీలోకి రావడం ఖాయమన్నారు. పార్టీలో వారికి సమచిత స్థానాన్ని కల్పిస్తామన్నారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు భవిరిశెట్టి హనుమంతరావు, కేంద్ర కమిటీ సభ్యులు వెంప జ్వాల నరసింహారావు, రాష్ట్ర పార్టీ సంయుక్త కార్యదర్శి కొండవీటి కోటేశ్వరరావు, కాపు సంక్షేమ సంఘం మాజీ డైరెక్టర్ మంగిశెట్టి కోటేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకుడు నిమ్మ విజయ సాగర్ బాబు, జిల్లా పంచాయతీ రాజ్ వింగ్ అధ్యక్షుడు ఆర్.లక్ష్మీనారాయణ, నాయుడు రాంబాబు, నాయుడు సాంబశివరావు, షేక్ ఆదం తదితరులు పాల్గొన్నారు.


