కూటమి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. నగర పంచాయతీ నుంచి జంగమహేశ్వరపురాన్ని విడదీయడం సిగ్గు చేటు. గ్రామంగా ఉన్న దానిని విలీనం చేసి పట్టణంగా మార్చడం వలన ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. నగర పంచాయతీగా ఉంటేనే రానున్న కాలంలో అభివృద్ధి సాధ్యపతుంది. గురజాలలోనే జంగమహేశ్వరపురం వుంచి నగర పంచాయతీగా కొనసాగించాలి. – ఇందుకూరి సుబ్బారెడ్డి, కౌన్సిలర్, జంగమహేశ్వరపురం
కేవలం రాజకీయ లబ్ది కోసమే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రానున్న ఎన్నికల్లో గెలవడం కష్టమనే కారణంతోనే అసంబద్ధమైన నిర్ణయం తీసుకున్నారు. గతంలో కూడా జంగమహేశ్వరపురం గురజాలలోనే ఉండేది. గ్రామంగా ఉన్నప్పుడు మురుగు కాలువలు తీయడం, వీధి లైట్లకు కూడా నిధులు ఉండేవి కావు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో సుమారుగా రూ. 22 కోట్లతో అభివృద్ధి జరిగింది. 24 గంటలు కరెంటుతో పాటు అర్బన్ హెల్త్ సెంటర్, 365 మందికి పట్టాలు మంజూరు చేసి ఇళ్లు నిర్మాణం చేసే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. రూ.12 కోట్లు నిధులతో అమృతసర్ 2.0 కింద ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వడంతో పాటు, అభివృద్ధికి నిధులు సమకూర్చుకునే విధంగా అవకాశం కలుగుతుంది. జంగమహేశ్వరపురంను గురజాల నగర పంచాయతీగా ఉంచితేనే అభివృద్ధి సాధ్యం.
– యెనుముల మురళీధర్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి
గురజాల నగర పంచాయతీ నుంచి జంగమహేశ్వరపురం గ్రామాన్ని తొలగించాలనే ఆలోచన విషయాన్ని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు విజ్ఞతకే వదిలేస్తున్నాం. గ్రామాన్ని పట్టణం చేసాం...పట్టణాన్ని నగరం కావడం చూశాం. కానీ ఇక్కడ అంతా రివర్స్.. పట్టణాన్ని గ్రామం చేయాలనే ఆలోచనతో ఉన్నారు. గత ఐదేళ్లు మేం అభివృద్ధి చేశాం కానీ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అభివృద్ధిని విస్మరించింది. కేవలం రాజకీయంగా ఎదుర్కోలేకనే ఈ విధమైన నిర్ణయం తీసుకుంటున్నారు. గ్రామ పంచాయతీలో నిధులు లేక అభివృద్ధి కుంటుపడుతుంది. నగర పంచాయతీలో నిధులు రావడంతో అభివృద్ధి చెందుతుంది.
– మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి
●
కూటమి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
కూటమి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి


