స్వర్ణోత్సవ సంబరం.. ఆనందం అంబరం
సత్తెనపల్లి: సత్తెనపల్లి పట్టణంలోని శరభయ్య గుప్తా హిందూ ఉన్నత పాఠశాలలో 1974–75 విద్యాసంవత్సరం పదో తరగతి విద్యార్థుల స్వర్ణోత్సవ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. పట్టణంలోని పాతబస్టాండ్ సెంటర్లో గల శుభమస్తు కన్వెన్షన్ హల్‌లో 50 ఏళ్ల తరువాత సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుని ఆనందాలను పంచుకున్నారు. కొందరు వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తూ ఉద్యోగ విరమణలు చేసి స్థిరపడగా మరికొందరు రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఈ సందర్భంగా నాడు చదువులు చెప్పిన గురువులు గర్రం కోటి వీరయ్య, తాడేపల్లి సీతారామాంజనేయులు, నూతలపాటి సాంబయ్య, బొడ్డు వసంతరావు, అమరావతి జ్ఞానానందం, ఎండీ బేగ్‌లను సన్మానించి గౌరవించుకున్నారు. ఒకరి కొకరు నాటి చిలిపి చేష్టలను చెప్పుకుంటూ 70 మంది కుటుంబ సభ్యులతో ఆనంద డోలికల్లో మునిగి తేలారు. కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు జక్కుల లక్ష్మీనారాయణ, సెక్రటరీ కొప్పురావూరి చిన్నకనకయయ్య, మెంబర్లు జవ్వాజి కనక దుర్గారావు, ఇబ్రహీం, సదాశివరావు, కంభాల వెంకటేశ్వరరావు, కొప్పురావూరి పెద్ద కనకయ్య, మట్టా సింహచలం, తాళ్ళూరి మల్లికార్జునరావు, సరికొండ సుబ్బరాజు, తదితరులు ఉన్నారు.
50 ఏళ్ల తరువాత కలుసుకున్న శరభయ్య గుప్తా హిందూ హైస్కూల్ పూర్వ విద్యార్థులు


