
ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌లో 15 అర్జీలు స్వీకరణ
నరసరావుపేట: జిల్లాలో ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రత్యేక ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో 15 అర్జీలు స్వీకరించారు. వీటిపై తక్షణమే స్పందించిన కలెక్టర్ సంబంధిత శాఖలకు ఆయా ఫిర్యాదులను అందజేసి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వెనుకబడిన వర్గాల వారి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా చొరవ తీసుకోని ప్రతి నెలా నాల్గవ శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. డీఆర్‌ఓ ఏకా మురళి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.