
అలా సాధ్యం కాదు...
వాగులపై చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చట్టపరంగా సాధ్యం కాదు. వాగులు, నదుల ప్రవాహాలను అడ్డగించి నిర్మాణాలు చేస్తే భారీ వర్షం కురిసినప్పుడు ముందుకు పోదు. కట్టడికాదు. ప్రవాహం ఒక్కసారిగా వెనక్కు తోసుకుని ఆకస్మిక వరదలుగా మారి సమీప గ్రామాలు, పంట పొలాలను ముంచెత్తుతాయి.
– రేపూడి మల్లికార్జునరావు,
డీఈఈ జలవనరుల శాఖ
అసాధ్యమేమీ కాదు
వాగునీటిని పూర్తిస్థాయిలో నిలుపుదల చేయడం అసాధ్యం. కానీ వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటిని వృథాగా పోనివ్వకుండా చెక్‌డ్యాంల ద్వారా నిల్వ చేసుకోవచ్చు. అవి భూమిలోకి ఇంకి భూగర్భజలాలు పెరుగుతాయి. తిరిగి సాగునీటిగానూ ఉపయోగపడతాయి. ప్రధానంగా వాగుల ప్రక్షాళన జరగాలి. కరకట్టల పటిష్టత, ఎత్తు పెంచడం, వాగు వెడల్పు పెంచి, పూడితతీత, జంగిల్ క్లియరెన్స్ పనులు పారదర్శకంగా జరగాలి. అప్పుడే లక్ష్యం నెరవేరుతుంది. పులిచింతల ప్రాజెక్టు ఇందుకు ఉదాహరణ!
–డాక్టర్ కొల్లా రాజమోహన్‌రావు,
నల్లమడ రైతు సంఘం నాయకులు
●

అలా సాధ్యం కాదు...