
ఆర్జిత సేవలకు డిమాండ్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):శ్రావణ అమావా స్య నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వా మి వార్లకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీచక్ర నవార్చ న, శాంతి కల్యాణం, చండీహోమాలలో ఉభయదాతలు అధిక సంఖ్యలో పాల్గొని తమ నామగోత్రాల తో పూజలు జరిపించుకున్నారు. శ్రావ ణ మాసాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక కుంకుమార్చనలు శనివారంతో ముగిశాయి. శనివారం కూడా పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక కుంకుమార్చనలు జరిపించుకున్నారు. సాయంత్రం పంచహారతుల సేవ, పల్లకీ సేవలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు.