
యూరియా కొరత లేదనడం హాస్యాస్పదం
ఫిరంగిపురం: వ్యవసాయ పనులు ప్రారంభమైనప్పటికీ రైతులకు యూరియా అందుబాటులోకి రాలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు పేర్కొన్నారు. మండల కేంద్రంలో శనివారం వ్యవసాయ కార్మికసంఘం సమావేశం నిర్వహించారు. అప్పారావు మాట్లాడుతూ యూరియా కొరతతో రైతులు ఇక్కట్లు పడుతుంటే అధికారులు మాత్రం కొరత లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉపాధి హామీ కూలీలకు బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలన్నారు. పనులు నిర్వహించి రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు వేతనాలు ఇవ్వలేదని తెలిపారు. వ్యవసాయ పనులు లేక వారు నానా ఇక్కట్లు పడుతున్నారని చెప్పారు. సీఐటీయూ మండల కార్యదర్శి షేక్, మస్తాన్‌వలి, ఎ.అంకారావు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.