
నృసింహాలయంలో వైభవంగా వరలక్ష్మీ వ్రతం
మంగళగిరి టౌన్: శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని మంగళగిరి నగరంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలను భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు చేశారు. మహిళలు వేకువజామునే ఇళ్లను, పూజ గదులను శోభాయమానంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడింది. ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్‌కుమార్ సమక్షంలో అర్చకులు వ్రతాలను నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి తిరుమంజన సేవ జరిగింది. అనంతరం శ్రీరాజ్యలక్ష్మి అమ్మవారికి పంచామృతాభిషేకం చేశారు.
స్వామి వారి వస్త్రాలు వేలం....
ఆలయంలో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి భక్తులు సమర్పించిన వస్త్రాలను శుక్రవారం బహిరంగ వేలం నిర్వహించారు. పట్టుచీరలు 43, ఫ్యాన్సీ చీరలు 387, పంచెలు 37 విక్రయించగా రూ. 91,150 ఆదాయం వచ్చిందని ఈవో తెలిపారు.
భక్తులతో కిటకిటలాడిన ప్రాంగణం

నృసింహాలయంలో వైభవంగా వరలక్ష్మీ వ్రతం