పింఛన్ల పంపిణీలో | - | Sakshi
Sakshi News home page

పింఛన్ల పంపిణీలో

Aug 21 2025 7:18 AM | Updated on Aug 21 2025 7:18 AM

పింఛన

పింఛన్ల పంపిణీలో

వెరిఫికేషన్‌ పేరిట భారీగా తొలగింపు నడవలేని నాకు పింఛన్‌ తొలగించారు

అన్ని అర్హతలున్నా అకారణంగా నోటీసులు జారీచేసిన కూటమి ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 35,096 దివ్యాంగ పింఛన్లు ఉండగా తాజాగా 3,162 మందివి తొలగింపు ఏడాదిగా ఇప్పటికే మరో 11 వేల పింఛన్లు కోత కొత్త పింఛన్లు మంజూరు చేయకపోగా ఉన్నవాటిలోనూ కత్తిరింపు

గతంలో ఏటా రెండుసార్లు

జిల్లాలో నోటీసులు అందుకున్నవారు..

వెరిఫికేషన్‌ పేరిట భారీగా తొలగింపు

ప్రమాదంలో నాకు రెండు కాళ్లు విరిగిపోయాయి. పెద్ద సర్జరీ చేసి రెండు కాళ్లలో రాడ్లు వేశారు. అయినా సరిగా నడవలేని పరిస్థితి. నా దుస్థితి చూసి వికలాంగ పింఛన్‌ మంజూరు చేశారు. అయితే నాకు వైకల్యం లేదని వికలాంగ పింఛన్‌ రద్దు చేస్తున్నామని నోటీసు ఇచ్చారు. ఏ పనిచేసుకోలేని నాకు ఆ రూ.6 వేలు జీవనాధారంగా ఉపయోగపడేది. ఉన్నఫళంగా ఇలా తొలగిస్తే నేను ఏమైపోవాలి.

– బత్తుల వీరబ్రహ్మం,

దొండపాడు, వినుకొండ రూరల్‌

సాక్షి, నరసరావుపేట: అధికారంలోకి వచ్చిన తరువాత వికలాంగ పింఛన్‌ నగదు మొత్తాన్ని రూ.6 వేలకు పెంచామని ఓ వైపు గొప్పలు చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం మరోవైపు ఉన్నఫళంగా అర్హుల పింఛన్లు నిర్దయగా తొలగించేస్తోంది. వికలాంగ ధ్రువపత్రాలతో దశాబ్దాల కాలంగా పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులను వెరిఫికేషన్‌, రీ అసెస్‌మెంట్‌ పేరిట పరిశీలన చేసి పింఛన్‌ రద్దు చేస్తున్నట్టు నోటీసులు పంపుతున్నారు. అర్హతుంటే మళ్లీ దరఖాస్తు చేసుకొని పింఛన్‌ పొందాలంటూ చెబుతున్నారు. ఒక కాలు, ఒక కన్ను లేకపోయినా వారు దివ్యాంగులు కాదంటూ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తున్నారు.

3162 మందికి అనర్హత

పల్నాడు జిల్లావ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల పరిధిలో గత నాలుగైదు రోజులుగా ఏకంగా 3,162 మందిని వికలాంగ పింఛన్‌కు అనర్హులుగా పేర్కొంటూ నోటీసులు అందజేస్తున్నారు. ఇందులో దివ్యాంగులు 3,086 మంది, పక్షవాతంతో మంచానపడ్డ వారు 51 మంది, ప్రమాదాలు, కండరాల వ్యాధితో బాధపడుతున్న వారు 25 మంది ఉన్నారు. జిల్లాలో మొత్తం 35,096 మందికి వికలాంగ పింఛన్లు ఉండగా అందులో రానున్న నెలలో 3,162 పింఛన్లు రద్దు కానున్నాయి. వీరంతా మండల కేంద్రాలలోని ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తమకు అన్యాయం చేయొద్దని, వైకల్యం చూసి కనికరించమని వేడుకుంటున్నారు.

కొత్త పింఛన్లు లేవు..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పల్నాడు జిల్లావ్యాప్తంగా సుమారు 11 వేలకు పైగా పింఛన్లు తొలగించారు. కొందరు హైకోర్టు మెట్లు ఎక్కి మళ్లీ పింఛన్‌ను తిరిగిపొందారు. తాజాగా ఇప్పుడు మరో 3 వేలకు పైగా పింఛన్లను తొలగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త పింఛన్లు మంజూరు చేయలేదు. 50 ఏళ్లు పైబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వృద్ధాప్య పింఛన్‌ ఇస్తామన్న హామీని ఇప్పటివరకు అమలు చేయలేదు. కూటమి ప్రభుత్వ తీరుతో జిల్లాలో సుమారు 2 లక్షలకు పైగా అర్హులు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. దీన్ని అమలు చేయకపోవడంతో జిల్లాలో అర్హులైన వారు ఏడాదికి సుమారు రూ.960 కోట్లు కోల్పోతున్నారు.

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ఏడాదిలో రెండుసార్లు కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు. అర్హతే ప్రామాణికంగా ఏటా జనవరి, జూలై నెలల్లో ఎటువంటి సిఫార్సు లేకుండా లబ్ధిదారుల ఎంపిక జరిగేది. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేకుండా, ఎవరినీ కలవాల్సిన అవసరం లేకుండా పింఛన్‌కు అర్హత సాధించేవారు. కూటమి ప్రభుత్వ ఏర్పడిన తరువాత జిల్లాలో ఒక్కటంటే ఒక్క పింఛన్‌ కూడా మంజూరు చేయలేదు. అన్ని అర్హతలుండి కొత్త పింఛన్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. కనీసం కొత్త పింఛన్లు ఎప్పుడు మంజూరు చేస్తారో కూడా చెప్పలేని దుస్థితి నెలకొనడంతో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు గ్రామ, వార్డు సచివాలయాలు, మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

నియోజకవర్గం దివ్యాంగులు పక్షవాతంతో ప్రమాదాలు, మొత్తం

మంచాన కండరాల వ్యాధితో

పడ్డవారు వైకల్యం గల వారు

చిలకలూరిపేట 824 8 6 838

గురజాల 702 7 4 713

మాచర్ల 168 11 0 179

నరసరావుపేట 532 12 3 547

పెదకూరపాడు 171 3 3 177

సత్తెనపల్లి 360 1 5 366

వినుకొండ 329 9 4 342

మొత్తం 3,086 51 25 3,162

పింఛన్ల పంపిణీలో1
1/2

పింఛన్ల పంపిణీలో

పింఛన్ల పంపిణీలో2
2/2

పింఛన్ల పంపిణీలో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement