
● గణపూజకు సిద్ధం
చిన్నా, పెద్ద సంతోషంగా జరుపుకొనే పండుగ వినాయక చవితి. ఈనెల 27న పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు వినాయక కమిటీలు, నిర్వాహకులు, యువకులు సిద్ధమవుతున్నారు. విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు పోటీ పడుతున్నారు. రాజస్థాన్, హైదరాబాద్, విజయవాడ, వరంగల్, బెంగళూరు ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు, వ్యాపారులు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గుడారాలు ఏర్పాటు చేసుకొని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో భారీ వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. అడుగు నుంచి 20 అడుగుల ప్రతిమలను తీర్చిదిద్ది, విక్రయిస్తున్నారు. అయితే పర్యావరణానికి హానిచేసే విగ్రహాలు వద్దని, మట్టి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. – సత్తెనపల్లి