
తాత్కాలిక వైకల్యమట..
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు కాసర్ల వెంకటరెడ్డి. పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామం. ఇతనికి ఓ ప్రమాదం వల్ల కుడి కాలు మోకాలి పైవరకు కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఒంటి కాలితో కర్రల సహాయంతో కష్టంగా నడవగలడు. గతంలో ఇచ్చిన సదరం సర్టిఫికెట్ ఆధారంగా వికలాంగ పింఛన్ వచ్చేది. కూటమి ప్రభుత్వం వెరిఫికేషన్, రీ అసెస్‌మెంట్ పేరిట పరిశీలన చేసి పింఛన్‌ను రద్దు చేసింది. ఆ విషయాన్ని ధ్రువపరుస్తూ ఇచ్చిన నోటీసులో వారు చెప్పిన సాకు కూటమి ప్రభుత్వం కుతంత్రాలను అద్దంపట్టేలా ఉంది. వెంకటరెడ్డికి ఒక కాలు మోకాలిపై వరకు పోవడం తాత్కాలిక వైకల్యమని తేల్చారట. ఈ కారణంతో పింఛన్ రద్దు చేశామని రాతపూర్వకంగా తెలిపారు. తాత్కాలికమంటే పోయిన కాలు భవిష్యత్తులో పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తుందా అన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.