
త్రిశక్తి దుర్గాపీఠం వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
సత్తెనపల్లి: త్రిశక్తి స్వరూపిణులైన మహాలక్ష్మి, దుర్గా, సరస్వతి అమ్మవార్ల త్రిశక్తి దుర్గా పీఠం 19వ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం మంగళ వాయిద్యాలతో బ్రహ్మోత్సవాలు అంకురార్పణ చేశారు. మహా సరస్వతి సమేత దుర్గామాతకు దశవిధాభిషేకాలు చేశారు. 108 కళాశాలతో అభిషేకాలు నిర్వహించారు. అమ్మవార్లకు పసుపు, కుంకుమ సమర్పణ చేశారు. త్రిశక్తి దుర్గాపీఠం మహిళా శక్తి సభ్యుల ఆధ్వర్యంలో లలిత సహస్రనామ పారాయణం, అమ్మవార్లకు అర్చన, హారతి, మంత్రపుష్పం, ప్రసాద వితరణ, సామూహిక కర్పూర హారతి నిర్వహించారు. అర్చకుడు కలవకొలను సీతారామశాస్త్రి ఆధ్వర్యంలో నిర్వహించిన పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో హాజర య్యారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా త్రిశక్తి దుర్గా పీఠం పీఠాధిపతులు వెలిదండ్ల హనుమత్ స్వామి ఏర్పాట్లను పర్యవేక్షించారు.