మచ్చుకై నా కనిపించని ‘క్రమశిక్షణ’ | - | Sakshi
Sakshi News home page

మచ్చుకై నా కనిపించని ‘క్రమశిక్షణ’

Aug 18 2025 6:07 AM | Updated on Aug 18 2025 6:07 AM

మచ్చుకై నా కనిపించని ‘క్రమశిక్షణ’

మచ్చుకై నా కనిపించని ‘క్రమశిక్షణ’

మచ్చుకై నా కనిపించని ‘క్రమశిక్షణ’ గుంటూరు మెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌లో పనిచేస్తున్న కార్యాలయ అధికారులు, ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ ఏడాది జనవరి 10న రిజిస్టర్‌ పోస్ట్‌ ద్వారా సదరు ఉత్తర్వులు వచ్చాయి. జూలై 30వ తేదీన వాటిని అందుకున్నట్లు తపాలా సెక్షన్‌లో నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా బోధన ఆస్పత్రులు, వైద్య కళాశాలలకు అధికార కేంద్రంగా పిలిచే డీఎంఈ కార్యాలయం నుంచి వచ్చిన ఫైల్‌ ఏడు నెలలుగా ఎక్కడ ఉందో ఎవరికీ తెలియకపోవటం ఆస్పత్రి అధికారుల పనితీరుకు నిదర్శంగా చెప్పుకోవచ్చు. ఏడు నెలలు ఆలస్యంగానైనా ఫైల్‌ ప్రత్యక్షం ఐనా... ఒకరికి బదులు మరొకరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారని బాధితుడు వాపోతున్నారు. డైట్‌ సెక్షన్‌కు సంబంధించిన ఫైల్‌ మిస్సింగ్‌ సంఘటనలో తనను బాధ్యుడిగా చేస్తూ తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ ఫైల్స్‌ నిర్వహణ తనకు కేటాయించిన విధుల్లో లేదని లిఖిత పూర్వకంగా ఆధారాలు సైతం అధికారులకు సమర్పించినా చర్యలకు సిఫార్సు చేసి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో అసలైన బాధ్యులపై చర్యలకు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారోనని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలో ఇప్పటికే పలువురు కిందిస్థాయి ఉద్యోగుల పదోన్నతుల ఫైల్స్‌ పెండింగ్‌లో ఉన్నాయి. నోటిఫికేషన్లు ఇస్తున్నారేగానీ, వారికి పదోన్నతి ప్రయోజనాలు రాకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆస్పత్రిలో పనిచేస్తూ ఎవరైనా చనిపోతే వారి కుటుంబ సభ్యులకు, పదవీ విరమణ చేసిన వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలు చాలా మందికి పెండింగ్‌లో ఉన్నాయి. కారుణ్య నియామకాల్లో కూడా తీవ్ర జాప్యం జరుగుతోంది. జీజీహెచ్‌ కార్యాలయం పనితీరుపై ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా ఉన్న జిల్లా కలెక్టర్‌ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆస్పత్రిలో పరిపాలన సవ్యంగా జరిగేలా చూడాలని ఉద్యోగులు, సిబ్బంది కోరుతున్నారు.

సంబంధం లేని వారిపై చర్యలకు సిద్ధం

ఉద్యోగుల ప్రయోజనాలకు గండి

జీజీహెచ్‌కు జనవరిలో

వచ్చిన ఫైల్‌ జూలై నెలలో ప్రత్యక్షం

క్రమశిక్షణ చర్యలకు

సంబంధించిన ఫైల్‌ తొక్కిపెట్టిన వైనం

ఆస్పత్రి అధికారుల

నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు

ఒకరికి బదులు మరొకరిపై

క్రమశిక్షణ చర్యలకు యత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement