ఘనంగా దివ్యబలిపూజ | - | Sakshi
Sakshi News home page

ఘనంగా దివ్యబలిపూజ

Aug 11 2025 6:34 AM | Updated on Aug 12 2025 12:39 PM

విజయపురి సౌత్‌: ప్రతి ఒక్కరూ దేవునిపై విశ్వాసంతో జీవించాలని సాగర్‌మాత ఆలయ విచారణ గురువులు పామిశెట్టి జోసఫ్‌ బాల సాగర్‌ ఉద్బోధించారు. ఆదివారం సాగర్‌మాత దేవాలయంలో జరిగిన దివ్యబలిపూజ కార్యక్రమంలో ఆయన భక్తులనుద్దేశించి ప్రసంగించారు. తోటివారిని ప్రేమించటం క్రైస్తవ్యంలో ప్రధానమన్నారు. ఏసుక్రీస్తు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. ఏసుప్రభువును ఈ ప్రపంచానికి అందించిన దివ్యమూర్తి మేరిమాత అని కొనియాడారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో జరిగిన తేరు ప్రదక్షిణలో భక్తులు పాల్గొన్నారు.

దుర్గమ్మ ఆలయానికి విరాళాలు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై ఉన్న కనక దుర్గమ్మ ఆలయానికి ఆదివారం పలువురు భక్తులు విరాళాలు అందజేశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన శీల రమ్య కుటుంబం అమ్మవారి నిత్యాన్నదాన పథకానికి రూ. 5,01,116 విరాళాన్ని ఆలయ అధికారులకు ఇచ్చారు. గుంటూరు పట్టాభిపురానికి చెందిన విజయ్‌ శైలేంద్ర అమ్మవారి ఉచిత ప్రసాద పంపిణీకి రూ. 90 వేలు విరాళాన్ని అందజేశారు. డోనర్‌ సెల్‌కు రూ.10 వేల విలువైన బీరువాను అందించారు. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌కు చెందిన బాలా ప్రగడ ఎన్‌ఎస్‌ కామేశ్వరి కుటుంబం దుర్గగుడి అభివృద్ధి పనులకు రూ.1,07,900 విరాళాన్ని అందజేసింది.

కేంద్ర మంత్రి ఆకస్మిక తనిఖీ

తెనాలి: కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్‌ శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్‌ ఆదివారం తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పచ్చ కామెర్లకు చికిత్స తీసుకుంటున్న రోగితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 30–40 మంది రోగులతో మాట్లాడానని, వారంతా ఆసుపత్రిలో వైద్యసేవలతో సంతృప్తి వ్యక్తం చేశారని మంత్రి చెప్పారు. రోగనిర్ధారణకు వినియోగించే సీటీ స్కాన్‌ చెడిపోయి చాలా కాలమైనా కొత్త పరికరం ఏర్పాటు చేయకపోవటం తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటానని చెప్పారు.

ఘనంగా దివ్యబలిపూజ 1
1/2

ఘనంగా దివ్యబలిపూజ

ఘనంగా దివ్యబలిపూజ 2
2/2

ఘనంగా దివ్యబలిపూజ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement