ప్రాణాలకు తెగించి సేవలు | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలకు తెగించి సేవలు

Jun 6 2025 6:07 AM | Updated on Jun 6 2025 6:07 AM

ప్రాణ

ప్రాణాలకు తెగించి సేవలు

మన్ననలు పొందిన సేవలు ఇలా...

గురజాల: ప్రతినెలా ఒకటో తేదీనే సూర్యోదయం ఇంకా కాకముందే ఇంటివద్దకు వచ్చి చిక్కటి చిరునవ్వుతో అవ్వా,తాతలను పలకరిస్తూ పెన్షన్‌ డబ్బులు వారి చేతిలో పెట్టేవారు.. ఫోన్‌ చేస్తే చాలు పలికి.. ఏ పని కావాలన్నా రోజుల వ్యవధిలోనే పూర్తి చేసేవారు. విద్యార్థులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు, రైతులకు కావల్సిన పట్టాదారు పాసుపుస్తకాలు, తదితర ఎన్నో రకాల సర్టిఫికెట్లు ఇంటికే వచ్చి అందజేసేవారు.. ప్రభుత్వ పథకాల, ఇతర సమాచారాన్ని ప్రజల చెంతకే చేర్చారు. వారే వలంటీర్లు. దేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేలా, గడప వద్దకే పాలన తెచ్చేలా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయ వ్యవస్థను తీసుకురాగా, దానికి అనుబంధంగా ప్రజలకు మరింత చేరువగా సేవలందించేందుకు వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పథకాలు, సర్టిఫికెట్లు తదితరాలు నేరుగా ప్రజలకు అందించే ఏర్పాట్లు చేశారు. అయితే నేటి కూటమి ప్రభుత్వం వలంటీర్లకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కి.. వారిని నడిరోడ్డుపై వదిలేసింది. వలంటీర్లను పూర్తిగా తొలగించడమే కాకుండా వారికి ఇవ్వాల్సిన బకాయిలను సైతం నేటికీ ఇవ్వలేదు.

నమ్మించి.. వంచించి

పల్నాడు జిల్లాలో మొత్తం 527 గ్రామ పంచాయతీలు, 8 మున్సిపాల్టీలు ఉన్నాయి. వాటిలో గ్రామ, వార్డు వలంటీర్లు 10,276 మందిని చంద్రబాబునాయుడు నమ్మించి వంచించాడు. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి హయాంలో బాగా పనిచేసిన వలంటీర్లుకు సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్రలుగా గుర్తించి వారికి అవార్డుల కింద కొంత నగదును అందించి ప్రోత్సహించారు.

కరోనా సమయంలో మా ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించాం. గౌరవ వేతనం కింద రూ.5వేలు అందించారు. కానీ మేం ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో వచ్చాం. చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే రూ.10వేలు వేతనం ఇస్తామని చెప్పారు. గెలిచిన వెంటనే వలంటీర్‌ వ్యవస్థనే రద్దు చేశారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పనిచేసే వలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలి.

– షేక్‌ సైదాబీ, గురజాల వలంటీర్‌

కోవిడ్‌ సమయంలో ప్రాణాలకు తెగించి వలంటీర్లు సేవలు అందించారు. కోవిడ్‌ సోకి సొంత కుటుంబ సభ్యులే దూరం పెట్టగా, వలంటీర్లు వారి ఇళ్లకు వెళ్లి నిత్యావసరాలు, మందులు ఇవ్వడమే కాకుండా వారికి ధైర్యం కూడా చెప్పి సేవలందించారు. నేటి కూటమి ప్రభుత్వం వారి సేవలను గుర్తించి, వేతనాలు పెంచకపోగా, ఉద్యోగాలు సైతం ఊడబెరికింది.

వలంటీర్లను వంచించిన చంద్రబాబు

వేతనం రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచుతామని ఎన్నికల్లో హామీ అధికారమెక్కాక వ్యవస్థకే మంగళం జిల్లాలో 10,276 మంది వలంటీర్లు రోడ్డున పడ్డ వలంటీర్ల కుటుంబాలు

ప్రాణాలకు

తెగించి విధులు నిర్వహించాం

ప్రతి నెల 1వ తేదీన తెల్లవారకముందే అవ్వాతాతల ఇళ్లకు వెళ్లి వారికి పింఛన్‌లు అందించేవారు. కొన్నిసార్లు లబ్ధిదారులు ఏదైనా అనుకోని కారణంతో దూర ప్రాంతంలో, వైద్యశాలలో ఉంటే అక్కడికి సైతం వెళ్లి పింఛన్‌ అందించేవారు.

పిల్లల చదువులకు కావల్సిన సర్టిఫికెట్లను ఇంటి వద్దకే తెచ్చి ఇచ్చేవారు.

అనేక సంక్షేమ పథకాలకు తమ పరిధిలోని అర్హులను ప్రత్యేకంగా గుర్తించి, లబ్ధి చేకూర్చారు.

కరోనా కష్టకాలంలో బాధితుల ఇళ్లకు వెళ్లి నీరు, ఆహారం, మందులు అందించారు. వారి ప్రాణాలను సైతం లెక్కచేయక సేవలు అందించారు.

ప్రాణాలకు తెగించి సేవలు 1
1/2

ప్రాణాలకు తెగించి సేవలు

ప్రాణాలకు తెగించి సేవలు 2
2/2

ప్రాణాలకు తెగించి సేవలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement