పాఠశాలలు తెరిచేనాటికి పుస్తకాలు పంపిణీ
సత్తెనపల్లి: పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులందరికీ పుస్తకాల పంపిణీ జరగాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.చంద్రకళ అన్నారు. సత్తెనపల్లి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలోని స్టాక్ పాయింట్‌లో ఉన్న శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పుస్తకాలను బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సత్తెనపల్లి మండలానికి ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు మొత్తం 50 వేల పుస్తకాలకు గాను 30 వేల పుస్తకాలు రాగా మరో 20 వేల పుస్తకాలు రావాల్సి ఉందన్నారు. పుస్తకాలను పరిశీలించిన డీఈఓ, ఎంఈఓ–2 ఎ.రాఘవేంద్ర రావుకు పలు సూచనలు చేశారు.
ఏపీ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్
అధ్యక్షుడిగా భూషణం
అచ్చంపేట: ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా స్థానిక ఏపీ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల/కళాశాల పీడీ గుడిపూడి భూషణం ఎంపియ్యారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఈనెల 6వ తేదీన చిత్తూరులో ఏపీ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ సభ్యులు సమావేశమై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు చెప్పారు. గత కొంతకాలంగా తమ పాఠశాలనుంచి రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న దృష్ట్యా తనను సభ్యులంతా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. తన శక్తివంచన లేకుండా రెజ్లింగ్ క్రీడకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చేలా కృషిచేస్తానన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ కరుణకుమార్, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది గుడిపూడి భూషణంను అభినందించారు.
పిచ్చికుక్క దాడిలో ముగ్గురికి గాయాలు
నూజెండ్ల: పిచ్చికుక్క దాడిలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డ సంఘటన మంగళవారం అర్ధరాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే మండలంలోని కమ్మవారిపాలెం యానాది కాలనీలో ఆరుబయట నిద్రిస్తున్న వారిపై పిచ్చికుక్క దాడి చేసింది. కాలనీకి చెందిన మల్లవరపు వెంకటేశ్వర్లు, మల్లవరపు అంకమ్మ, చలంచర్ల అప్పారావులను కుక్క కరిచింది. 108 వాహనంలో వారిని నూజెండ్ల పీహెచ్‌సీకి తరలించారు. వైద్యుడు అందుబాటులో లేకపోవటంతో అక్కడి వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స చేసి వినుకొండ వైద్యశాలకు తరలించారు.
పాఠశాలలు తెరిచేనాటికి పుస్తకాలు పంపిణీ
పాఠశాలలు తెరిచేనాటికి పుస్తకాలు పంపిణీ


