నరసరావుపేట ఈస్ట్: దేశవ్యాప్తంగా అధ్యాపకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ, కాలేజ్ టీచర్స్ ఆర్గనైజేషన్ పిలుపులో భాగంగా సోమవారం శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల ఎయిడెడ్ అధ్యాపకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఆర్గనైజేషన్ 33వ కాన్ఫరెన్స్ తీర్మానం మేరకు ఈనెల 24, 25, 26 తేదీలల్లో అధ్యాపకులు తమ డిమాండ్ల సాధనకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నట్టు ఆక్టా రాష్ట్ర అధ్యక్షుడు కోండ్రు మోహనరావు తెలిపారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనీ, ఎన్‌ఈపీ–2020 ఉపసంహరించుకోవాలని కోరారు. ఎయిడెడ్ కళాశాలల్లో పనిచేస్తున్న పార్ట్‌టైం అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఆక్టా నాయకులు డాక్టర్ ముద్దా రమేష్, డాక్టర్ ఐ.సదాశివరెడ్డి, డాక్టర్ పీఎన్‌వీడీ మహేష్, డాక్టర్ బి.వెంకటేశ్వరరావు, డాక్టర్ భానునాయక్, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఆక్టా రాష్ట్ర అధ్యక్షుడు మోహనరావు