
ఎకై ్సజ్ హెడ్ కానిస్టేబుల్ సంఘ జిల్లా అధ్యక్షుడిగా క
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా మార్పు కోటయ్య ఎన్నికయ్యారు. ఆదివారం నగరంలోని రెవెన్యూ కల్యాణ మండపంలో అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. అసోసియేట్ అధ్యక్షులుగా మైల శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా జి.కొండలరావు, కె.రజని, జనరల్ సెక్రెటరీగా ఎం.లక్ష్మణరావు, జాయింట్ సెక్రెటరీగా ఆర్.కోటేశ్వరరావు, పాతపాటి రమేష్, ట్రెజరర్‌గా ిసీహెచ్.అనూష, ప్రెస్ సెక్రటరీగా ఎం. కోటేశ్వరరావు, పి.రాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ిసీహెచ్.ఆంజనేయులు, ఎన్.రవిశంకర్, కోటి శ్రీనివాసరావు, జె.విమలను ఎన్నుకున్నారు. కొత్తగా ఎన్నిౖకైన కమిటీని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అరుణ కుమారి అభినందించారు.
న్యాయవాదుల డెత్ బెనిఫిట్స్ రూ.6లక్షలకు పెంపు
గుంటూరు లీగల్: న్యాయవాదుల డెత్ బెనిఫిట్స్ రూ.5 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ నిర్ణయించింది. గతంలో న్యాయవాదులు అనారోగ్యానికి గురైప్పుడు రూ.లక్షగా ఉన్న మెడికల్ బెనిఫిట్స్ రూ.1.50 లక్షలకు పెంచుతున్నట్లు తీర్మానించింది. ఇది ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుందని పేర్కొంది. యాక్సిడెంట్ డెత్ జరిగితే బార్ కౌన్సిల్ వెల్ఫేర్ ఫండ్‌తో సంబంధం లేకుండా రూ.5 లక్షలు ఇచ్చే విధంగా తీర్మానించింది. ఇది మే 1 నుంచి అమలులోకి వస్తున్నట్లు వెల్లడించింది.
లవ్ యువర్ ఫాదర్
చిత్ర బృందం సందడి
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): గుంటూరు నగరంలో లవ్ యువర్ ఫాదర్ (ఎల్‌వైఎఫ్) చిత్ర బృందం సందడి చేసింది. వచ్చేనెల 4న ఎల్‌వైఎఫ్ చిత్రం విడుదలకానుంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం బందావన్‌గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి చిత్ర ిహీరో శ్రీహర్ష, నటులు బంటి, శ్రీకర్, నిర్మాత కిషోర్ రాఠీ బృందం చేరుకుంది. తొలుత శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో పూజలు నిర్వహించారు. అనంతరం నటుడు శ్రీహర్షను ఆలయ పాలక మండలి అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య సత్కరించి, చిత్ర బందానికి తీర్థ ప్రసాదాలను అందించారు. చిత్ర హీరో శ్రీహర్ష మాట్లాడుతూ వచ్చే నెల 4న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ థియేటర్లల్లో వీక్షించాలని కోరారు. పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లా డుతూ చిత్ర టైటిల్ లవ్ యువర్ ఫాదర్ బాగుందని అన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ గుంటూరు, పల్నాడు జిల్లాల పార్లమెంట్ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ ఫాదర్స్ డే రోజునే కాకుండా తండ్రిని ప్రతి నిత్యం ప్రేమించాలని అన్నారు.

ఎకై ్సజ్ హెడ్ కానిస్టేబుల్ సంఘ జిల్లా అధ్యక్షుడిగా క