నరసరావుపేటటౌన్: పట్టణంలోని పలు మందుల దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఔషధ నియంత్రణ శాఖ అధికారులు సంయుక్తంగా శుక్రవారం దాడులు నిర్వహించారు. ఆపరేషన్ గరుడలో భాగంగా బరంపేటలోని భాగ్యశ్రీ మెడికల్ ఏజెన్సీ దుకాణంలో మొదట తనిఖీలు నిర్వహించారు. దుకాణానికి సంబంధించి రిక్షా సెంటర్ సమీపంలో ఇళ్ల మధ్య ఉన్న గోదాంలో సోదాలు చేపట్టారు. అనుమతులు లేకుండా భారీ స్థాయిలో మందులు నిల్వ ఉంచినట్లు విజిలెన్స్ బృందం గుర్తించింది. మందులను సీజ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఫిజీషియన్ శాంపిల్స్ ఉన్నట్లు సమాచారం. నరసరావుపేట రూరల్ సీఐ పి. రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దాడుల్లో డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు మంగమ్మ, పద్మ, విజిలెన్స్ ఏఈఈ శివన్నారాయణ, ఎఫ్‌ఆర్‌ఓ సైదులు, విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.
అనుమతులు లేకుండా గోదాం నిర్వహణ
భారీగా అక్రమ ఔషధాలు స్వాధీనం
దాడుల్లో పాల్గొన్న విజిలెన్స్,
డ్రగ్స్ అధికారులు
మందుల దుకాణాలపై దాడులు