పత్తి ఉత్పత్తిని పెంచేందుకు కృషి జరగాలి | - | Sakshi
Sakshi News home page

పత్తి ఉత్పత్తిని పెంచేందుకు కృషి జరగాలి

Published Sat, Mar 22 2025 2:02 AM | Last Updated on Sat, Mar 22 2025 1:58 AM

గుంటూరు రూరల్‌: దేశంలో పత్తి పంట ఉత్పత్తి పెంచేలా కృషి జరగాలని వక్తలు అభిప్రాయపడ్డారు. నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలోని ఎన్జీ రంగా వర్సిటీలో ఐసీఏఆర్‌ సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కాటన్‌ రీసెర్చ్‌ (ఐసీఏఆర్‌– సీఐసీఆర్‌), వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా పత్తి వార్షిక సమూహ సమావేశం (ఏజీఎమ్‌) –2025ను శుక్రవారం ప్రారంభించారు. మూడురోజులపాటు జరిగే ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలు, విత్తన కంపెనీల ప్రతినిధులు ముఖ్య భాగస్వాములు హాజరయ్యారు. పత్తి ఉత్పత్తి పెంపుపై చర్చించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎన్జీరంగా వర్సిటీ ఉపకులపతి డాక్టర్‌ ఆర్‌. శారదజయలక్ష్మీదేవి అధ్యక్షత వహించారు. ఆమె పురుగుమందుల వినియోగాన్ని తగ్గించడంలో బీటీ పత్తి కీలకపాత్ర పోషించినట్టు వివరించారు. వర్సిటీ విడుదల చేసిన నరసింహ (ఎన్‌ఏ–1325) పత్తి రకం విజయ ప్రస్థానం గురించి చెప్పారు. పత్తి రైతుల నికర ఆదాయాన్ని గణనీయంగా పెంచడంలో ఇది దోహదపడిందని తెలిపారు. డాక్టర్‌ పీవీ సత్యనారాయణ మాట్లాడుతూ దేశంలో పత్తి ఉత్పత్తి పెంపునకు కృషి జరగాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐసీఏఆర్‌, సీఐసీఆర్‌ నాగపూర్‌ సంచాలకులు డాక్టర్‌ వై.జి. ప్రసాద్‌, ఐసీఏఆర్‌, సీఐఆర్‌సీఓటీ ముంబై డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌కే శుక్లా, ఐసీఏఆర్‌ పంట శాస్త్ర విభాగం సహాయ డైరెక్టర్‌ జనరల్‌ (వాణిజ్య పంటలు) డాక్టర్‌ ప్రశాంతకుమార్‌దాస్‌, పత్తి ప్రాజెక్ట్‌ పర్యవేక్షణ, సలహా కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ సిడి మాయీ తదితరులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.

పత్తిపంట అఖిల భారత వార్షిక సమూహ సమావేశంలో వక్తలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement