గోదాదేవి అలంకరణలో శ్రీవారు
సత్తెనపల్లి: ధనుర్మాసాన్ని పురస్కరించుకొని సత్తెనపల్లిలోని వడ్డవల్లి శ్రీ రామాలయం, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం, రైల్వేస్టేషన్ రోడ్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. స్వామివార్లను ప్రత్యేకంగా అలంకరించి గోత్రనామాలతో అభిషేకాలు నిర్వహించారు. కోలాట ప్రదర్శన చేపట్టారు. రైల్వేస్టేషన్‌రోడ్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారిని గోదాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.
తెనాలిటౌన్: శ్రీ విశ్వావసు నామ సంవత్సర ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం వైకుంఠపురంలో స్వామివారికి ముక్కోటి ఏకాదశి దశావతార మహోత్సవాలు కనుల పండువగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం స్వామివారిని వామనావతారంలో అలంకరించి పురవీధుల్లో రథంపై ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వి.అనుపమ, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
పెదకాకాని: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జులైలో జరిగిన బీఈడీ రీవాల్యుయేషన్ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షలు నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు బుధవారం విడుదల చేశారు. మొదటి, రెండు సంవత్సరాల రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను ప్రకటించారు. అలానే బీటెక్, బీఆర్క్ పరీక్షల నూతన షెడ్యూల్‌ను విడుదల చేశారు. బీటెక్, బీఆర్క్ పరీక్షలు జనవరి 3వ తేదీ, 9వ తేదీ జరుగుతాయన్నారు. పూర్తి వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో సంప్రదించాలని తెలిపారు.
తెనాలిటౌన్: ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు సతీమణి జయశ్రీ బుధవారం గుంటూరు జిల్లా తెనాలిలోని వైకుంఠపురం దేవస్థానానికి విచ్చేశారు. తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, వన్‌టౌన్ సీఐ వి.మల్లిఖార్జునరావు, ఆలయ సహాయ కమిషనర్/ కార్యనిర్వహణ అధికారి వి.అనుపమ, అర్చకులు ఆలయ మర్యాదప్రకారం జయశ్రీకి స్వాగతం పలికారు. అనంతరం శ్రీలక్ష్మీపద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని, పూజలు చేశారు.
సాక్షి టాస్క్‌ఫోర్స్: డ్రగ్స్ కేసులో చీరాల మండలం రామకృష్ణాపురానికి చెందిన మాదిగాని బాలప్రకాష్ బాలు(ప్రస్తుతం బాపట్ల మండ లం స్టువర్టుపురంలో నివాసం) అనే వ్యక్తిని రెండు రోజుల కిందట హైదరాబాద్‌లో రాజేంద్రనగర్ ఎస్‌ఓటీ, రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ కేసులో ఇతను ఏ3గా ఉన్నాడు. బాలప్రకాష్‌బాలుకు టీడీపీ కృష్ణాజిల్లాలో ఎంపీకి అనుచరుడుగా వ్యవహరిస్తున్న మాదిగాని గురునాథంకు దగ్గరి బంధువు. ఇతను పుట్టింది చీరాల మండలం రామకృష్ణాపురంలో కాగా అసాంఘిక కార్యకలాపాలన్నీ రాష్ట్రంలోని గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా జిల్లాతో పా టు తెలంగాణ రాష్ట్రంలోనూ నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం చీరాల, బాపట్ల ప్రాంతాల్లో సంచలనంగా మారింది.
గోదాదేవి అలంకరణలో శ్రీవారు
గోదాదేవి అలంకరణలో శ్రీవారు
గోదాదేవి అలంకరణలో శ్రీవారు


