రాష్ట్రస్థాయి సైన్స్ ప్రదర్శనలో సత్తా చాటిన పల్నాడు
జాతీయస్థాయికి ఒకటి, సౌత్ ఇండియాకు మూడు ప్రాజెక్ట్‌లు ఎంపిక
నరసరావుపేట ఈస్ట్: రాష్ట్రస్థాయి విజ్ఞాన ప్రదర్శనలో పల్నాడు జిల్లా ప్రాజెక్టులు మెరిశాయి. విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌లో పల్నాడు జిల్లాకు చెందిన నాలుగు ప్రాజెక్ట్‌లు ఎంపిక కాగా, వాటిలో ఒకటి జాతీయస్థాయికి, మరో మూడు సౌత్ ఇండియాకు ఎంపికై నట్టు జిల్లా సైన్స్ ఆఫీసర్ ఎస్.రాజశేఖర్ బుధవారం సాయంత్రం తెలిపారు.
జాతీయస్థాయికి నాదెండ్ల మండలం గణపవరం జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు టి.జగన్మోహనరెడ్డి, టి.జస్వంత్, గైడ్ టీచర్ ఐ.సాంబశివరావు రూపొందించిన స్మార్ట్ బస్ ఎంపికై ంది. సౌత్ ఇండియా స్థాయికి పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి జెడ్పీ స్కూల్ విద్యార్థి వి.రాహుల్, గైడ్ టీచర్ బి.లక్ష్మయ్య రూపొందించిన కార్బన్ అబ్జర్వేషన్ ఇన్ ఎయిర్, అచ్చంపేట సాంఘిక సంక్షేమశాఖ పాఠశాల విద్యార్థి వి.ఛాన్స్‌లర్, గైడ్ కె.శివనారాయణ ప్రాజెక్ట్ రోబోటిక్ ఈ కార్, టీచర్ విభాగంలో నకరికల్లు మండలం కండ్లగుంట జెడ్పీ ఉపాధ్యాయుడు జి.శ్రీనివాసరావు ప్రాజెక్ట్ విద్యుత్ అయస్కాంత ప్రభావాలు ఎంపికయ్యాయి. ఎంపికై న ప్రాజెక్ట్‌ల రూపకర్తలను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, డీఈఓ పీవీజే రామారావు, డిప్యూటీ డీఈఓలు షేక్ సుభాని, వి.యేసుబాబు, ఉపాధ్యాయులు అభినందించారు.


