రాష్ట్రంలోనే పేరెన్నికగన్న ఆలయాలలో కోటప్పకొండ ఒకటి. ఆలయ
వివాదాస్పదంగా కోటప్పకొండ ఆలయ ఈఓ వ్యవహారం గుండెపోటుతో ఆలయ ఉద్యోగి మృతి ఈఓ వేధిపులే కారణం అంటూ బంధువుల ఆరోపణ అర్చకుల పోస్టులు అమ్ముకున్నారంటూ విమర్శలు బినామీ పేర్లతో కాంట్రాక్ట్ పనుల నిర్వహణ దాతల పట్ల దురుసు ప్రవర్తన
ఆలయ
సిబ్బందిపై
వేధింపులు
నరసరావుపేట రూరల్: పవిత్ర పుణ్యక్షేత్రమైన కోటప్పకొండ ఆలయానికి రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. దేశంలోని ప్రముఖమైన శైవక్షేత్రంగా వెలుగొందుతున్న కోటప్పకొండ దేవస్థానానికి అపఖ్యాతి తీసుకువచ్చేలా ఆలయ ఈఓ నిర్ణయాలు ఉన్నాయి. సిబ్బందిపై వేధింపులు, అర్చకుల పోస్ట్‌లు అమ్ముకోవడం, శానిటేషన్ సిబ్బంది తొలగింపు, బినామి పేర్లతో కాంట్రాక్ట్ పనులు నిర్వహించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఆలయ అభివృద్ధికి ఉదారంగా విరాళాలు అందజేస్తున్న దాతలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి.
అర్చకుల పోస్ట్‌లు అమ్మకం
ఆలయంలోని మూడు అర్చకుల పోస్ట్‌లను భర్తీ చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా పోస్ట్‌ల భర్తీలో ఈఓకు భారీగా ముడుపులు ముట్టినట్టు అర్చకులు ఆరోపిస్తున్నారు. ఒక్కో పోస్ట్‌కు రూ.10లక్షలు తీసుకున్నాడని విమర్శించారు. ఈ మేరకు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబును అర్చకులు కలిసి ఈఓపై ఫిర్యాదు చేశారు. అన్ని అర్హతలు ఉన్నా తమకు కాకుండా కొందరికే లబ్ధి చేకూరేలా ఈఓ వ్యవహరించాడని తెలిపారు.
దాతల పట్ల నిర్లక్ష్యం
ఆలయంలో నిత్యాన్నదాన పథకం భవనానికి చిలకలూరిపేటకు చెందిన వ్యాపారులు రూ.1.5కోట్లు విరాళంగా అందించారు. తామే స్వయంగా నిర్మాణాన్ని చేపట్టారు. దీంతో పాటు యాత్రికుల విశ్రాంత గదులను వారు నిర్మిస్తున్నారు. వీరి పట్ల ఆలయ ఈఓ చంద్రశేఖర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తెలుస్తుంది. దీంతో వ్యాపారులు ఈఓ దేవాదాయ శాఖ కమిషనర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నెల 6వ తేదీన ఆలయంలో నిర్వహించిన ఆరుద్రోత్సవం సందర్భంగా ఏర్పాట్లు సక్రమంగా చేయకపోవడంపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. భక్తులకు అన్నసంతర్పణ చేసేందుకు వచ్చిన దాతలను చులకనగా మాట్లాడినట్టు తెలుస్తుంది. దీంతోపాటు ప్రతి పనికి పర్సంటేజ్ డిమాండ్ చేసినట్టు సమాచారం.
ఆలయ ఈఓగా చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సిబ్బందిపై వేధింపులు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఆలయ సిబ్బందితోపాటు ఔట్ సోర్సింగ్, ఎన్‌ఎంఆర్‌లు, కన్సాల్డిడెట్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. పొరుగు సేవల సిబ్బంది పట్ల ఈఓ అనుచితంగా వ్యవహరించేవాడని సమాచారం. ఆలయంలో జరిగే పలు అభివృద్ధి పనులకు ఆయనే కాంట్రాక్టర్‌గా మారి బినామీలతో పనులు నిర్వహించేవాడని సమాచారం. ఇందులో భాగంగా పొరుగు సేవలు, శానిటేషన్ సిబ్బందిని ఆయా పనులకు వాడుకునేవాడని చెబుతున్నారు. ఆయా పనులు చేసేందుకు నిరాకరించిన వారిని ఈఓ వేధింపులకు గురిచేసేవాడని వారు వాపోతున్నారు. నాసరయ్యను కూడా ఇలాగే వేధించాడని, మెమో కూడా ఇవ్వడంతో మానసిక ఒత్తిడికి గురై గుండెపోటుతో మృతిచెందాడని చెబుతున్నారు. ఆలయ సూపరింటెండెంట్ చల్లా శ్రీనివాస్ మాటలు విని ఈఓ వేధింపులకు పాల్పడ్డాడని తెలిపారు. ఆలయంలో ఎన్నో యేళ్లుగా శానిటేషన్ పనిచేస్తున్న 18 మందిని కొంతకాలం క్రితం ఈఓ తొలగించాడు. ప్రైవేటు పనులకు వీరు సహకరించకపోవడంతోనే చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. వీరి స్థానంలో నెలకు అధిక మొత్తంలో చెల్లించే విధంగా ప్రైవేటు సంస్థకు శానిటేషన్ బాధ్యతలు అప్పగించారు.
రాష్ట్రంలోనే పేరెన్నికగన్న ఆలయాలలో కోటప్పకొండ ఒకటి. ఆలయ
రాష్ట్రంలోనే పేరెన్నికగన్న ఆలయాలలో కోటప్పకొండ ఒకటి. ఆలయ


