యడ్లపాడు: జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి లిక్కర్ లారీ బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రకాశం జిల్లా సింగరాయకొండ నుంచి మద్యం లోడుతో సామర్లకోట వెళుతున్న లారీని రోడ్డు పక్కగా ఆపి డ్రైవర్ నిద్ర పోతున్నాడు. ఈ సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో లారీ లిక్కర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లిక్కర్ లారీ సర్వీస్ రోడ్డుపై పడిపోగా, డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మద్యం సీసాలు పగిలి రోడ్డుపై పడిపోయాయి. సమాచారం అందుకున్న ఎకై ్సజ్ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని లీకేజీని పరిశీలించారు. పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరించి, లారీ తొలగించే చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో
ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం
విజయపురిసౌత్‌త్: ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ సరోజిని తెలిపారు. ఆమె కళాశాలలో బుధవారం విలేకర్లతో మాట్లాడారు. ఈ నెల 31వ తేదీ కల్లా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ చేరడానికి ఏప్రిల్ 25వ తేదీ మధ్యాహ్నం 2.30గంటల నుంచి 5గంటల వరకు 26 కేంద్రాల్లో ప్రవేశపరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. ఫీజు రూ. 300ను ఆన్‌లైన్ ద్వారానే చెల్లించాలని తెలిపారు. గురుకుల, జూనియర్ కళాశాలల్లో నాణ్యమైన బోధనతో పాటు ఉచిత హాస్టల్ వసతి, నోట్, టెక్ట్స్ బుక్స్ అందించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికై న విద్యార్థులకు జేఈఈ మెయిన్స్, నీట్, సీఏ(సీపీటీ) కోచింగ్ ఇస్తామని తెలిపారు. నోటిఫికేషన్, పూర్తి వివరాల కోసం www.aprrapcfrr.in వెబ్‌సైట్‌లో చూడాలని ఆమె సూచించారు. అర్హత గల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు.
జూట్ ఉత్పత్తులతో ఆర్థికాభివృద్ధి సాధించాలి
రాజుపాలెం: జూట్ ఉత్పత్తుల తయారీలో శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని సీఎస్‌ఆర్ డైరెక్టర్ డాక్టర్ బి. బబిత తెలిపారు. మండలంలోని కొండమోడు మండల పరిషత్ పాఠశాలలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగం ఆధ్వర్యంలో మహిళలకు జూట్ ఉత్పత్తుల తయారీలో శిక్షణను బుధవారం ప్రారంభించారు. డైరెక్టర్ బబిత మాట్లాడుతూ నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గ్రామంలోని ముస్లిం మహిళలకు జూట్ ఉత్పత్తుల శిక్షణను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. మహిళలు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో సీఎస్‌ఆర్ ప్రోగ్రాం అధికారి మండూరి వెంకటరమణ, శిక్షకురాలు పి.దుర్గ, కె.ఎన్.ఆర్. విద్యా సంస్థల డైరెక్టర్స్ కోనేటి నరసింహారావు, బాడిసె మస్తాన్‌రావు పాల్గొన్నారు. మొదటి రోజు శిక్షణకు 50 మంది మహిళలు హాజరయ్యారు.
జాతీయ రహదారిపై లిక్కర్ లారీ బోల్తా
జాతీయ రహదారిపై లిక్కర్ లారీ బోల్తా