గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరులోని ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) ప్రాంతీయ కార్యాలయ ఆధ్వర్యంలో ఈనెల 27న నిధి ఆప్‌కే నికత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ ఇంద్రనీల్ ఘోష్ బుధవారం ఓప్రకటనలో తెలిపారు. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఉదయం 9.30 గంటల నుంచి నిర్వహించనున్నట్టు వెల్లడించారు. గుంటూరు కృష్ణనగర్‌లోని ఈఎస్‌ఐ ఆస్పత్రి, కృష్ణాజిల్లా నందివాడ మండలం తమిరిసలోని ఉమా స్పింటెక్స్ ప్రైవేటు లిమిటెడ్, ఒంగోలులోని ఈఎస్‌ఈసీ బ్రాంచ్, విజయవాడ గాంధీనగర్‌లోని ఈఎస్‌ఈసీ బ్రాంచ్ కార్యాలయం, బాపట్ల జిల్లా కారంచేడులోని శ్రీసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం తిమ్మాపురంలోని వసంత ఇండస్ట్రీస్‌లో కార్యక్రమాలు జరగనున్నాయని వివరించారు.