చట్టబద్ధమైన పాలనతో పట్టిషమైన న్యాయవ్యవస్థ | - | Sakshi
Sakshi News home page

చట్టబద్ధమైన పాలనతో పట్టిషమైన న్యాయవ్యవస్థ

Nov 28 2023 2:18 AM | Updated on Nov 28 2023 2:18 AM

కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి

షేక్‌ ఇంతియాజ్‌

గుంటూరు ఎడ్యుకేషన్‌: చట్టబద్ధమెన పాలన తో పట్టిషమైన న్యాయవ్యవస్థను నెలకొల్పగలమని వైఎస్సార్‌ కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి షేక్‌ ఇంతియాజ్‌ పేర్కొన్నారు. సోమవారం సాంబశివపేటలోని ఏసీ లా కళాశాలలో దళిత సీ్త్ర శక్తి ఆధ్వర్యంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘‘చట్టబద్ధపాలన–రాజ్యాంగం’’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. దళిత సీ్త్ర శక్తి జాతీయ కన్వీనర్‌ గెడ్డం ఝాన్సీ అధ్యక్షతన జరిగిన సదస్సులో ముఖ్య అతిఽథిగా పాల్గొన్న ఇంతియాజ్‌ మాట్లాడుతూ మన దేశంలో చట్టబద్ధ్దపాలన అమలు చేయడంలో న్యాయవ్యవస్థ పటిష్టంగా పని చేస్తుందనీ, రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక అధికరణాలు, చట్టాలను చైతన్యవంతంగా అర్థం చేసుకుని ఉపయోగించుకోవాలని కోరారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ మాట్లాడుతూ చట్టబద్ధ్దమైన పాలనతోనే నాగరిక సమాజాభివృద్ధిని చూడగలమని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధ్దమైన సమాజం లేకుంటే మానవ సమాజం అఽథోగతి పాలవుతుందని, ఆటవిక పాలనతో ప్రజలు అనేక కష్టాల పాలవుతారని అన్నారు. చట్టబద్ధ పాలన లేకుంటే దళితులపై దాడులు మరింతగా జరిగేవన్నారు. రాజ్యాంగాన్ని అమలు చేయడం ద్వారానే సమ సమాజం ఏర్పడి, సమాజంలోని ప్రతి ఒక్కరికీ అన్ని రంగాల్లో అవకాశాలు దక్కుతున్నాయని తెలిపారు. ఏసీ లా కళాశాల కరస్పాండెంట్‌ జి. ఎలీషా మాట్లాడుతూ మనుషులందరు సమానులే అనే సౌభ్రాతృత్వ భావన లేకపోతే దేశం అభివృద్ధి చెందదని అన్నారు. మహిళలు సమానత్వం సాధించడంలో దళిత సీ్త్ర శక్తి చేస్తున్న పోరాటాలు చాలా అవసరమన్నారు. సభాధ్యక్షురాలు గెడ్డం ఝాన్సీ మాట్లాడుతూ మహిళలపై జరిగే అన్ని రకాల హింసను రూపుమాపేందుకు అంతర్జాతీయంగా చేపట్టిన ప్రచారోద్యమంలో భాగంగా దళిత సీ్త్ర శక్తి ఆధ్వర్యంలో ఈనెల 25 నుంచి డిసెంబర్‌ 10వ తేదీ వరకు 16 రోజుల పాటు దళిత, ఆదివాసీ సీ్త్రలపై హింసకు వ్యతిరేకంగా ప్రచార ఉద్యమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. సదస్సులో ఏసీ లా కళాశాల ప్రిన్సిపాల్‌ అమృతవర్షిణి, ఏఎన్‌యూ లా అసోసియేట్‌ ప్రొఫెసర్‌ సతీష్‌, అమల కుమారి, పలువురు న్యాయవాదులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement