
అర్జీల పరిష్కారమే ధ్యేయం కావాలి
జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు
నరసరావుపేట రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో అందిన ఆర్జీల పరిష్కారంలో బాధితుల సంతృప్తే ధ్యేయంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజాసమస్యల పరిస్కార వేదిక నిర్వహించారు. ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి 131 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలన్నారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని భరోసా కల్పించాలని తెలిపారు. నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అచ్చంపేట మండలం వేల్పూరుకు చెందిన మహిళలకు వితంతు పెన్షన్ మంజూరు కాలేదు. దీనిపై గ్రామానికి చెందిన శిఖా రమాదేవి, ఆవుల శివపార్వతి, ముత్యాల గంగమ్మలు ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో అడిగితే కొత్త పెన్షన్‌లు ఇంకా ఇవ్వడం లేదని చెప్పారన్నారు. కలెక్టర్‌ను కలిసి అర్జీ పెట్టుకుందామని వచ్చినట్లు వివరించారు. శిఖా ప్రియాంక అనే మహిళ దివ్యాంగ పింఛను కోసం అర్జీ ఇచ్చారు.
ప్రస్తుతం నరసరావుపేట మండలం లింగంగుంట్ల రాజుపాలెంలో ఉంటున్నాను. మాకు రేషన్ కార్డు మాచర్ల మండలంలో ఉంది. కార్డును రాజుపాలెంకు మార్చాలని సచివాలయంలో అడిగినా మార్చడం లేదు. కొత్త రేషన్ కార్డు ఇవ్వడం లేదు. కనీసం సరకులు ఇవ్వాలని కోరినా రాజుపాలెంలో డీలర్ నిరాకరిస్తున్నారు.
– తాళ్లూరి సామ్రాజ్యం,
రాజుపాలెం

అర్జీల పరిష్కారమే ధ్యేయం కావాలి

అర్జీల పరిష్కారమే ధ్యేయం కావాలి