
జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు
నరసరావుపేట రూరల్: పీజీఆర్‌ఎస్ ఫిర్యాదులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవలని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు సూచించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ, ఆస్తి, మోసం తదితర సమస్యలపై 90 అర్జీలు అందాయి. పీజీఆర్‌ఎస్ అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ వహించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్, క్రైం అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతి, మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ వెంకటరమణ పాల్గొన్నారు.