పర్లాకిమిడి: గజపతి జిల్లా పుట్టాసింగి నుంచి వయా సెరంగో పర్లాకిమిడికి అక్రమంగా తరలిస్తున్న 22 బస్తాల గంజాయిని మంగళవారం సాయంత్రం సెరంగో పోలీసు అధికారులు పట్టుకున్నారు. గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న పక్కా సమాచారంతో సెరంగో పోలీసు ష్టేషన్ పరిధిలోని రాగిడి పుట్ట వద్ద రైడింగ్ పార్టీ కాపుకాశారు. పోలీసులను చూసిన గంజాయి మాఫీయా (బోలేరో మహీంద్ర మ్యాక్స్ పికప్) వ్యాన్ను వదిలి అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. వ్యానుకు ఎస్కార్ట్గా వస్తున్న హీరో గ్లాబర్ బండిని కూడా వదిలి వేసినట్లు సబ్ డివిజనల్ పోలీసు అధికారి అమితావ్ పండా తెలిపారు. వ్యాన్లో ఉన్న 22 గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకుని, అదనపు తహసీల్దార్, ఎగ్జిక్యూటివ్ మాజిస్ట్రేట్ (గుమ్మ) సునీల్ కుమార్ స్వయిని సమక్షంలో కాటా వెశారు. మొత్తం 507.900 కిలోల గంజాయి ఉన్నట్టు నిర్ధారించారు. గంజాయి రవాణా చేసిన వ్యాన్, బైక్ను సెరంగో పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.


