గంజాయి సాగుపై అధికారుల పంజా | - | Sakshi
Sakshi News home page

గంజాయి సాగుపై అధికారుల పంజా

Nov 19 2026 1:01 AM | Updated on Nov 19 2026 1:01 AM

స్వాభిమాన్‌ అంచల్‌లో అక్రమ గంజాయి తోటలు ధ్వంసం

క్షేత్రస్థాయిలోకి దిగిన జిల్లా కలెక్టర్‌, ఎస్పీ

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి స్వాభిమాన్‌ అంచల్‌ ఆంధ్రా సరిహద్దు ప్రాంతంలో కొంతమంది గంజాయిని అక్రమ సాగు చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న జిల్లా యంత్రాగం దాడులకు పూనుకుంది. పాపర్‌మేట్ల, ధూళిపూట్‌ పంచాయతీ సమీపంలో సిలిరిమెట్ట గ్రామ అడవిలో సాగు చేస్తున్న గంజాయి వనాలపై బుధవారం దాడులు చేసి ధ్వంసం చేశారు. అనంతరం ఆ ప్రాంతాంలోకి జిల్లా కలెక్టర్‌ ప్రధమేశ్‌ అర్వింద్‌ రాజ్‌శిర్కే, జిల్లా ఎస్పీ వినోద్‌ పటేల్‌ స్వయంగా వెళ్లి పరిశీలించారు. గంజాయి మొక్కలను పెకిలించి ధ్వంసం చేయించారు. అటవీ భూముల్లో నిషేధిత గంజాయిని పడించకూడదని గిరిజనులకు అవగాహన కల్పించారు. చట్టవిరుద్ధమైన గంజాయి సాగును విడిచిపెట్టి ప్రత్యామ్నాయంగా ఇతర చట్టబద్ధమైన పంటలను సాగు చేయాలని సూచించారు. ప్రజల జీవనోపాధి, సంక్షేమానికి జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడు ప్రాధాన్యత ఇస్తుందని కలెక్టర్‌ ప్రధమేశ్‌ అన్నారు. స్వయంగా జిల్లా అధికారులే క్షేత్రస్థాయిలోకి దిగి గంజాయి మొక్కలు ధ్వంసం చేయడం చూసిన గ్రామస్తులు కూడా వారికి సహకరించి గంజాయి మొక్కలను పీకేసి ధ్వంసం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement